కరోనాతో భారత్‌లో మరో వ్యక్తి మృతి
ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడి దేశంలో మరో వ్యక్తి మృతిచెందాడు. తాజా మరణంతో భారత్‌లో కరోనా వైరస్ మరణాల సంఖ్య పదికి చేరుకుంది.
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడి దేశంలో మరో వ్యక్తి మృతిచెందాడు. తాజా మరణంతో భారత్‌లో కరోనా వైరస్ మరణాల సంఖ్య పదికి చేరుకుంది. కొన్ని రోజుల కిందట విదేశాల (యూఏఈ) నుంచి వచ్చిన వృద్ధుడు కరోనా కాటుకు బలయ్యాడు. మృతుడి వయసు 65అని అధికారులు తెలిపారు. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి
కరోనా వైరస్ (CoronaVirus) సోకిన ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ముంబయిలోని కస్తూర్బా గాంధీ హాస్పిటల్‌లో చేర్పించారు. దురదృష్టవశాత్తూ ఆ వృద్ధుడు చికిత్స పొందుతూనే సోమవారం కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ దేశంలో కరోనా మరణాలు 10 నమోదు కాగా, 4 మరణాలతో ముంబై అగ్రస్థానంలో ఉంది. దీంతో మహారాష్ట్ర అధికారులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. శుభవార్త.. ఐటీ రిటర్న్స్ తుది గడువు పొడిగించిన కేంద్రం
దేశంలో తొలి మరణం కర్ణాటకలో నమోదైన విషయం తెలిసిందే. ముంబైలో నలుగురు చనిపోయారు. రాజస్థాన్, బిహార్, పశ్చిమ బెంగాల్,ఢిల్లీ రాష్ట్రాల్లోనూ ఒక్కొ వ్యక్తి ప్రమాదకర కరోనా వైరస్ బారిన పడి చనిపోయారు. దేశంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 500 దాటగా, అందులో మహారాష్ట్రలోనే 100 కేసులు ఉండటం గమనార్హం. ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా
పుణేలోనే కరోనాను పరీక్షించే ల్యాబ్ ఉండటం, తొలి రోజుల నుంచి అక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి శాంపిల్స్ టెస్టుల కోసం పంపిస్తున్న విషయం తెలిసిందే. అధికంగా 60ఏళ్లకు పైబడిన వారు చనిపోగా, బిహార్ లోని పాట్నాకు చెందిన 38ఏళ్ల వ్యక్తి మన దేశంలో కరోనాతో చనిపోయిన అతిపిన్న వయస్కుడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..