భారత్‌లో రికార్డు కరోనా కేసులు.. ఒక్కరోజులో 613 మరణాలు
COVID19 Cases In India | కరోనా మహమ్మారి తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ఒకటి. దేశంలో ఒకరోజులో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వివరాలు వెల్లడించింది.
దేశంలో కరోనా వైరస్ (India COVID19 Cases) మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. నిత్యం పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో 24,850 కరోనా పాజిటివ్ కేసులను నిర్ధారించారు. కాగా, ఒక్కరోజు నమోదైన కేసులలో భారత్‌లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. 43 మందిని బలిగొన్న పిడుగులు, భారీ వర్షాలు
తాజా కేసులతో కలిపితే దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య (India CoronaVirus Cases) 6,73,165కు చేరింది. ఇందులో చికిత్స అనంతరం 4,09,083 మంది ప్రాణాంతక కోవిడ్19 బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,44,814 మంది చికిత్స పొందుతున్నారు. డౌన్‌లోడ్స్‌లో దుమ్మురేపుతోన్న Chingari App
భారీ సంఖ్యలో మరణాలు
గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనాతో పోరాడుతూ 613 మంది మరణించారు. భారత్‌లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 19,268కి చేరింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఈ వివరాలు ఆదివారం వెల్లడించింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!