India Russia Summit 2021: భారత్-రష్యా 21వ వార్షిక ద్వైపాక్షిక సదస్సు మంగళవారం (డిసెంబర్ 6) ఢిల్లీ (Delhi) వేదికగా జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకోనున్నారు. 2019లో జరిగిన బ్రిక్స్ సదస్సు (BRICS Summit) తర్వాత ఇరు దేశాల అధినేతలు ముఖాముఖి భేటీ అవుతుండటం ఇదే తొలిసారి. తాజా ద్వైపాక్షిక సదస్సులో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) వెల్లడించిన వివరాల ప్రకారం... మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది. రాత్రి 9.30 గంటలకు పుతిన్ (Vladimir Putin) ఢిల్లీ నుంచి రష్యాకు తిరుగుపయనమవుతారు. సదస్సులో భాగంగా 2+2 పద్దతిలో ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రుల మధ్య కూడా చర్చలు జరగనున్నాయి. రష్యా తరుపున ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, రక్షణ మంత్రి సెర్గీ షోయ్గు ఆదివారం రాత్రే ఢిల్లీ చేరుకున్నారు. భారత్ తరుపున విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సదస్సులో పాల్గొంటారు.


తాజా సదస్సులో ప్రధాని మోదీ (Narendra Modi), రష్యా అధ్యక్షుడు పుతిన్... పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. అలాగే ఆఫ్గన్‌లో నెలకొన్న పరిస్థితులు, సీమాంతర ఉగ్రవాదంపై చర్చించే అవకాశం ఉంది. ఇదే సదస్సులో ఇరు దేశాల మధ్య 10 కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్‌లో సుమారు ఐదు లక్షల ఏకె-47 రైఫిల్స్ తయారీకి రూ.5100 కోట్ల ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేసే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితమే కేంద్ర కేబినెట్ ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, భారత్-రష్యా మధ్య ప్రతీ ఏటా ద్వైపాక్షిక సదస్సు జరుగుతోంది. గతేడాది కోవిడ్ కారణంగా సదస్సు రద్దయింది. చివరిసారిగా 2019లో రష్యాలోని వ్లాదివొస్తోక్‌లో జరిగిన ద్వైపాక్షిక సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు.


Also Read: Invisible Forces: అదృశ్య శక్తులపై పోలీసులకు మహిళ ఫిర్యాదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook