'కరోనా వైరస్' మహమ్మారి.. రాకాసి పడగ వెంటాడుతోంది. భారత దేశంలో పాజిటివ్ కేసుల విపరీతంగా పెరుగుతోంది. రోజు రోజుకు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తే వెన్నులో వణుకుపుట్టక మానదు. అవును.. నిన్న ఒక్క రోజే నమోదైన కొత్త కేసుల సంఖ్య 6 వేల  654గా ఉంది. ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే ఇప్పటి వరకు అత్యధికం కావడం విశేషం. అలాగే నిన్న ఒక్క రోజే కరోనా మహమ్మారికి 137 మంది బలయ్యారు. మరోవైపు దేశంలో కరోనా బారిన పడ్డవారి సంఖ్య లక్షా 25 వేల మార్క్ దాటింది. 


ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా లక్షా 25 వేల 101 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 69 వేల 597 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 3 వేల 720 మంది ప్రాణాలు విడిచారని వెల్లడించింది. కేసులు పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు  కూడా పెరగడం విశేషం. ప్రస్తుతం భారత్ లో రికవరీ రేటు 41.39 శాతంగా ఉందని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 


నిజానికి లాక్ డౌన్ సహా ఇతర చర్యలు తీసుకోవడం ద్వారా కేసుల సంఖ్య బాగా  తగ్గిందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.  లేనిపక్షంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరిగేది చెప్పుకొచ్చింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సహా వివిధ మోడళ్లను అనుసరించడం వల్ల 36 నుంచి 70 లక్షల మంది కరోనా బారిన పడకుండా అడ్డుకోగలిగామని తెలిపింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..