Vaccination in India: కరోనా వ్యాక్సినేషన్‌లో ఇండియా కొత్త రికార్డు సాధించింది. వ్యాక్సినేషన్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ..అత్యధికంగా వ్యాక్సిన్ అందించిన దేశంగా ఖ్యాతినార్జించింది.కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల్ని వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్‌ ( Corona virus ) కు వ్యాక్సిన్ అందుబాటులో వచ్చిన వెంటనే ప్రపంచంలోని పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ( Vaccination ) ప్రారంభమైంది. ఇండియా కంటే ముందుగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది. అయితే ఆ దేశాల్ని దాటుకుని ఇండియా రికార్డు సాధించింది. అత్యధికంగా వ్యాక్సినేషన్ చేసిన దేశంగా ఖ్యాతినార్జించింది. కేంద్ర ఆరోగ్య శాఖ ( Union Health Ministry ) వెల్లడించిన వివరాల ప్రకారం ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే ముందంజలో ఉంది. 


ఇండియాలో ఇప్పటివరకూ అంటే కేవలం 13 రోజుల వ్యవధిలో 30 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్ చేశారు. ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాక్సిన్ ఇచ్చిన దేశమైంది. 30 లక్షల వ్యాక్సినేషన్ మార్క్ చేరుకునేందుకు అమెరికాకు 18 రోజుల వ్యవధి పట్టగా..ఇజ్రాయిల్ దేశానికి 33 రోజులు పట్టింది. అటు బ్రిటన్‌కు 36 రోజులు పట్టింది. భారత్ బయోటెక్ ( Bharat Biotech ) అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్ ( Covaxin ), సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum Institute ) ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ ( Covidshield ) వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగపు అనుమతిచ్చారు. ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 16న ప్రారంభమైంది. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే కర్ణాటక  ( Karnataka ) దేశంలో మొదటి స్థానంలో ఉంది. కర్ణాటకలో 2 లక్షల 86 వేల 89 మందికి వ్యాక్సిన్ అందింది. తరువాతి స్థానాల్లో మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. 


Also read: International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగించిన DGCA


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook