India Corona Update: ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు కారణంగా కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) విపత్కర పరిస్థితుల్నించి దేశం కోలుకున్నా..ఇంకా కొత్త కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35-40 వేల మధ్యలోనే సాగుతోంది. గత 24 గంటల్లో ఇండియాలో 36 వేల 83 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 21 లక్షల 92 వేల 576కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 3 లక్షల 85 వేల 336 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 493 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోగా..ఇప్పటి వరకూ 4 లక్షల 31 వేలమంది మృత్యువాత పడ్డారు. దేశంలో కరోనా టెస్ట్ పాజిటివిటీ రేటు 1.88 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 49 కోట్ల 36 లక్షల 24 వేల 440 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 97.46 శాతం కాగా..మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకూ 54 కోట్లమందికి వ్యాక్సిన్ ఇచ్చారు. 


కేరళలో ఇప్పటికీ రోజుకు 18 వేల కేసులు దాదాపుగా నమోదవుతున్నాయి. అటు కర్ణాటకలో చిన్నారుల్లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడటం ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా కేవలం 11 రోజుల వ్యవధిలో 6 వందలమంది చిన్నారులకు కరోనా సోకడం కలవరం కల్గిస్తోంది. కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave)ముప్పుపై దేశవ్యాప్తంగా ఆందోళన రేగుతోంది. 


Also read: Heavy Rains Alert: రానున్న 48 గంటల్లో ఏపీకు అతి భారీ వర్షాల ముప్పు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook