DRDO: యాంటీ రేడియేషన్ మిస్సైల్ ‘రుద్రం’ ప్రయోగం సక్సెస్
త్రుదేశాల నుంచి భవిష్యత్తులో ఎలాంటి ముప్పు ఎదురైన ధీటుగా జవాబిచ్చేందుకు భారత్ (India) అన్ని విధాలుగా సమయత్తమవుతోంది. ఇందులో భాగంగా భారత రక్షణ రంగాన్ని వీదేశీ, స్వదేశీ పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేస్తూ తిరుగులేని శక్తిగా రూపాంతరం చెందుతోంది. తాజాగా భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో సరికొత్త అస్త్రాన్ని పరిక్షించింది.
Anti Radiation Missile Rudram Test Succes: న్యూఢిల్లీ: శత్రుదేశాల నుంచి భవిష్యత్తులో ఎలాంటి ముప్పు ఎదురైన ధీటుగా జవాబిచ్చేందుకు భారత్ (India) అన్ని విధాలుగా సమయత్తమవుతోంది. ఇందులో భాగంగా భారత రక్షణ రంగాన్ని వీదేశీ, స్వదేశీ పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేస్తూ.. తిరుగులేని శక్తిగా రూపాంతరం చెందుతోంది. తాజాగా భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో సరికొత్త అస్త్రాన్ని పరిక్షించింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన యాంటీ రేడియేషన్ క్షిపణి ‘రుద్రం-1’ (Anti Radiation Missile Rudram) ను భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మొట్టమొదటి యాంటీ-రేడియేషన్ క్షిపణి. ఇది శబ్ద వేగం కన్నా రెట్టింపు వేగంతో లక్ష్యం వైపు దూసుకెళుతుంది. Also read: Baba ka Dhaba viral video: గిరాకీ లేదని కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధ దంపతులు.. వీడియో వైరల్
శత్రు దేశాల రాడార్లను మట్టి కరిపించే ఈ రుద్రం క్షిపణిని ఉదయం 10.30 గంటలకు ఒడిశాలోని బాలాసోర్ నుంచి డీఆర్‌డీవో (Defence Research and Development Organisation) అధికారులు ప్రయోగించారు. భారత వాయు సేనకు చెందిన సుఖోయ్-30 ఎంకే1 ( SU-30 Mk1 ) యుద్ధ విమానం ద్వారా దీనిని పరీక్షించారు. ఇది నిర్థేశించిన లక్ష్యంతో శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను దెబ్బతీయగలదని డీఆర్‌డీవో వెల్లడించింది. ఈ మిసైల్‌తో వాయుసేనకు మరింత బలం చేకూరింది. ఈ క్షిపణిని యుద్ధ విమానాల ద్వారా కనిష్టంగా 500 మీటర్ల ఎత్తు నుంచి, గరిష్ఠంగా 15 కిలోమీటర్ల ఎత్తు నుంచి దీనిని ప్రయోగించి.. శుత్రు రాడార్లను, ట్రాకింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలను నాశనం చేయవచ్చు. Also read: Lalu Prasad Yadav: బీహార్ మాజీ సీఎం లాలూకు బెయిల్.. కానీ
ఇదిలాఉంటే.. క్షిపణి ప్రయోగం విజయవంతంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) హర్షం వ్యక్తచేశారు. ఈ సందర్భంగా ఆయన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ ట్విట్ చేశారు. అయితే డీఆర్‌డీవో ఇటీవలకాలంలో వరుసగా క్షిపణి పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే స్మార్ట్ టార్పిడో మిస్సైల్‌ను కూడా విజవంతంగా పరీక్షించింది. Also read: Rishikesh: అమెరికా మహిళపై అత్యాచారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe