Mood of the Nation: ఎన్డీటీవీ, ఇండియా టుడే, టౌమ్స్ నౌ సంస్థలైతే ప్రతి 5-6 నెలలకు ఓ సర్వే నిర్వహిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మారుతున్న ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే..సీ ఓటర్‌తో కలిసి తాజాగా సర్వే నిర్వహించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియా టుడే సీ ఓటర్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఆశ్చర్యకర ఫలితాలు వెలువడ్డాయి. ఈ సర్వేను జూలై 15 నుంచి ఆగస్టు 14 మధ్యన నిర్వహించారు. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో అధికారంలో వచ్చేది ఎవరు, మోదీ, రాహుల్ ప్రజాదరణ ఎలా ఉంది. ఎన్డీయే-ఇండియా కూటమి పరిస్థితి ఏంటనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం ఈసారి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృకత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారం సాధించడం ఖాయమని తేలిపోయింది. ఈసారి ఎన్డీయే 306 సీట్లతో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తేలింది. 


ఇక ఇటీవలే ఇండియా కూటమిగా ఏర్పడిన ప్రత్యర్ధి పార్టీలు 193 సీట్లకు పరిమితం కానున్నారు. ఇతర పార్టీలు మరో 44 స్థానాలు గెల్చుకోనున్నాయి. కేవలం ఆరు నెలల వ్యవధిలో జరిగిన సర్వేలో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ నేషన్ సంస్థ ఇటీవల జనవరి నెలలో కూడా సర్వే చేపట్టింది. ఆ సర్వేలో ఎన్డీయేకు 298 స్థానాలు లభిస్తాయని, ఇతరులకు 92 స్థానాలు, ఇండియా కూటమికి 153 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అంటే ఇప్పటికీ అప్పటికీ తేడా కన్పిస్తోంది. మొన్నటి సర్వేతో పోలిస్తే ఈసారి ఎన్డీయే, ఇండియా టుడే కూటమి సీట్లు పెంచుకోగా, ఇతరులు మాత్రం చాలా సీట్లు కోల్పోయారు. 


2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 357 స్థానాలు లభించగా ఈసారి అంటే ఇప్పుడు ఎన్నికలు జరిగితే 302 స్థానాలు లభించనున్నాయి. కొత్తగా ఏర్పడిన ఇండియా కూటమి సీట్ల సంఖ్యను పెంచుకోనుంది. ఇక ఓటు షేర్ విషయంలో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య అంతరం కేవలం 2 శాతమే ఉండటం విశేషం. అంటే ఎన్డీయేకు 43 శాతం ఓటు షేర్ లభిస్తే..ఇండియా కూటమికి 41 శాతం లభించింది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ సొంతంగా 182 స్థానాలు గెల్చుకునే అవకాశముండగా బీజేపీ 287 స్థానాలు గెలవచ్చు. ఇక ఇతరులు 74 సీట్లు గెల్చుకునే అవకాశముంది. 


అయితే ఈ సర్వేపై భిన్నాభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో దేశమంతా కేవలం 25,591 మందితో నేరుగా మాట్లాడి అభిప్రాయం తెలుసుకోగా 1,34, 487 మంది రెగ్యులర్ ట్రాకర్ డేటాను దీనికి కలిపి విశ్లే,షించారు. అంటే మొత్తం 1,60,438 శాంపిల్ సైజ్‌తో ఇదే మొత్తం దేశం మూడ్ అంటే ఎలా సాధ్మమనే ప్రశ్నలు వస్తున్నాయి. 2019 ఎన్నికల ప్రకారం 90 కోట్ల మంది ఓటర్లున్నారు దేశంలో. అంటే 90 కోట్ల ఓటర్లలో కేవలం లక్షన్నరమంది అభిప్రాయాన్ని మూడ్ ఆఫ్ ది నేషన్ అనడంపై విమర్శలు వస్తున్నాయి.


Also read: Memes on Chandrayaan-3: రాఖీ పండుగ ముందే వచ్చేసింది": చంద'మామ'కి రాఖీ కట్టిన 'భారత్' మాత



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook