కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ విమానం
![కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ విమానం కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ విమానం](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2018/07/18/171605-iaf-jet-plane-crashed-in-himachal-pradesh.jpg?itok=PhPH6zX-)
ఘటనపై విచారణకు ఆదేశించిన భారత వైమానిక దళం
భారత వైమానిక దళానికి చెందిన తేలికపాటి విమానం ఎంఐజీ-21 హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో ప్రమాదవశాత్తుగా కూలిపోయింది. బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో పైలట్ మృతి చెందినట్టు భారత వైమానిక దళం స్పష్టంచేసింది. పంజాబ్‌లోని పటాన్‌కోట్ వైమానిక స్థావరం నుంచి రోజువారీ విధుల్లో భాగంగానే గాల్లోకి లేచిన ఈ యుద్ధ విమానం ఆ తర్వాత కొద్దిసేపట్లోనే మధ్యాహ్నం 1:21 గంటలకు కంగ్రా జిల్లాలోని పట్టా జటియాన్‌కి సమీపంలోని మెహ్ర పల్లి గ్రామంలోని పొలాల్లో కూలిపోయింది.
ఘటనపై శాఖాపరమైన అంతర్గత విచారణకు ఆదేశించినట్టు భారత వైమానిక దళం స్పష్టంచేసింది.