ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఓ తేలికపాటి విమానం శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తుగా ఉత్తర్ ప్రదేశ్‌లోని బాఘ్‌పట్‌కి సమీపంలోని చెరుకు పంట చేనులో కూలిపోయింది. అదృష్టవశాత్తుగా ఈ ఘటనలో ఇద్దరు పైలట్స్ సహా ఎవ్వరికీ ఎటువంటి హానీ జరగలేదు. ఈ ఘటనలో భూమి మీదకు దూసుకొచ్చిన విమానం ముందు భాగం నేలను ఢీకొని ఆగింది. ఈ ఘటనపై స్పందించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగం మీడియా ప్రతినిధి .. "గతంలో ఎన్నడూ ఈ తరహా ప్రమాదం చోటుచేసుకోలేదని, ఘటనలో ఇద్దరు ఫైలట్స్ సురక్షితంగా బయటపడ్డారు"అని తెలిపారు. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే అది కూలిపోయినట్టు మీడియా ప్రతినిధి చెప్పారు.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING