భారత వైమానిక దళం తన 85వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఘజియాబాద్‌లోని హిందాన్ ఎయిర్ బేస్‌లో వివిధ మిలట్రీ పేరేడ్స్‌తో పాటు ఎయిర్ షోలు కూడా జరగనున్నాయి. ఈ క్రమంలో మనం కూడా భారత వైమానిక దళానికి సంబంధించిన 10 ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. 1933లో భారత వైమానిక దళంలో కేవలం 6 మంది మాత్రమే శిక్షణ పొందిన ఆఫీసర్లు ఉండేవారు. అలాగే ఎయిర్ మెన్ కేవలం 19 మంది మాత్రమే ఉండేవారు. అలాగే మనవద్ద కేవలం నాలుగు ఎయిర్ క్రాఫ్టులు మాత్రమే ఉండేవి. అవి కూడా వెస్ట్ లాండ్ వాపిటీ ఐఐఏ ఎయిర్ క్రాఫ్టులు మాత్రమే.


2.1 ఏప్రిల్, 1933 తేదీన భారత వైమాన దళానికి చెందిన తొలి స్క్వాడ్రన్ ప్రారంభమైంది. 


3.రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలో, మన సామర్థ్యం కేవలం 16 ఆఫీసర్లు మరియు 663 ఉద్యోగులు మాత్రమే. అదే యుద్ధం ముగిశాక ఆ సంఖ్య 28,500కు పెరిగింది.


4.మార్చి 1945లో యుద్ధంలో మన సేనలు చూపిన ప్రతిభకు గౌరవంగా, అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం మన వైమానిక దళానికి "రాయల్" అనే పదాన్ని జోడించింది.


5.మనకు స్వాతంత్ర్యం సిద్ధించాక, 1950లో భారత వైమానిక దళం పాకిస్తాన్‌తో నాలుగు యుద్ధాలు, చైనాతో ఒక యుద్ధం చేయడం గమనార్హం.


6.1946లో మన వైమానిక దళానికి తొలి ట్రాన్స్‌పోర్ట్ యూనిట్ లభించింది.


7.తర్వాత మన వైమానిక దళం అనేక ప్రముఖ ఆపరేషన్లలో పాల్గొంది. అందులో ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ కాక్టస్, ఆపరేషన్ పూమలై ప్రముఖమైనవి.