శనివారం మహారాష్ట్రలో రక్షణ హెలికాఫ్టర్ కూలిపోయింది. రాయ్‌గఢ్‌‌ జిల్లాలో భారత తీరప్రాంత రక్షణ దళానికి చెందిన హెలికాఫ్టర్ మురుద్ సమీపంలో కూలినట్లు అధికారులు తెలిపారు. హెలికాఫ్టర్‌లో ఉన్నవారందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో హెలికాఫ్టర్‌లో నలుగురు ఉండగా ముగ్గురు సురక్షితంగా బయటకు వచ్చారని, ఓ మహిళకు మాత్రం గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. హెలికాఫ్టర్ ల్యాండ్‌ అవుతుండగా ప్రమాదం జరినట్లు తెలుస్తోంది. హెలికాఫ్టర్ గాల్లో ఉన్నప్పుడే సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. ఈ విషయమై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


కాగా, పవన్‌ హాన్స్‌ సంస్థకు చెందిన హెలికాఫ్టర్‌ ముంబయి తీరంలో రెండు నెలల క్రితం ప్రమాదానికి గురైంది.  ఆ సమయంలో హెలికాఫ్టర్‌లో ఐదుగురు ఒఎన్‌జిసి అధికారులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు.  ఈ ఘటన విమానాశ్రయం నుండి బయలుదేరి అరేబియా సముద్రంలోని ఒఎన్‌జిసికి క్షేత్రానికి వెళ్లే మార్గంలో జరిగింది.