న్యూఢిల్లీ: కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగిస్తోన్న హైడ్రోక్లోరోకిన్ ఔషదాన్ని తమకు ఎగుమతి చేయాల్సిందిగా 25 దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు భారత్ ఓకే చెప్పింది. దేశంలో ఉన్న నిల్వల గురించి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ఎన్నో సమాలోచనలు చేసిన తర్వాతే భారత సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా మలేరియా నివారణ కోసం ఉపయోగించే ఈ హైడ్రోక్లోరోకిన్ మెడిసిన్‌ని తమకు సరఫరా చేయాల్సిందిగా మొత్తం 30 దేశాల నుంచి భారత్‌కి విజ్ఞప్తులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. హైడ్రోక్లోరోకిన్ ఎగుమతి చేయాల్సిందిగా కోరిన దేశాల జాబితాలో అగ్రరాజ్యమైన అమెరికా ఉండటం గమనార్హం. స్వయంగా ఆ దేశాధినేతలే భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మరీ విజ్ఞప్తి చేయడం ఇక్కడ గమనించదగిన మరో అంశం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Containment zones: హైదరాబాద్‌లో ఆ 12 ఏరియాల్లోకి నో ఎంట్రీ, నో ఎగ్జిట్


హైడ్రోక్లోరోకిన్ ఔషదాన్ని ఎగుమతి చేసేందుకు అంగీకరించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ ఎం బోల్స్‌నారో ఇప్పటికే భారత ప్రధాని మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. క్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు స్నేహితుల మధ్య పరస్పర సహకారం మరింత ఎక్కువగా ఉండాలి. కష్టకాలంలో ఆదుకుంటున్నందుకు మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమని భారత ప్రధాని మోదీతో పాటు భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..