దేశవ్యాప్తంగా Lockdown విధించండి: కేంద్రానికి IMA లేఖ
IMA calls for nation wide lockdown: న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో పాటు వైద్య సదుపాయాలు, ఆక్సీజన్ కొరత, బెడ్స్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాల్సిన అవసరం కనిపిస్తోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు ఓ లేఖ రాసింది.
IMA calls for nation wide lockdown: న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో పాటు వైద్య సదుపాయాలు, ఆక్సీజన్ కొరత, బెడ్స్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాల్సిన అవసరం కనిపిస్తోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు ఓ లేఖ రాసింది. ఇటీవల కాలంలో రోజూ కరోనా పాజిటివ్ కేసులు 4 లక్షలు దాటడం సర్వసాధారణమైంది. కరోనా పాజిటివ్ కేసులు ఇలాగే పెరుగుతూపోతే.. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత చేయి దాటిపోయే ప్రమాదం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది.
Also read: Corona symptoms ఉంటే పాజిటివ్ రిపోర్ట్ అవసరం లేదు: కేంద్రం
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనావైరస్ వ్యాప్తిని (Corona second wave) నిరోధించాలంటే లాక్‌డౌన్ తప్పనిసరి అని సూచించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. ఇకనైనా మేల్కోకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని హెచ్చరించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాసిన లేఖపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఏమని స్పందిస్తుందోననేదే ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్వయంగా ఆందోళన వ్యక్తంచేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే (Complete lockdown in India) అంశంపై కేంద్రం ఏదో ఓ నిర్ణయం తీసుకోకతప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe