ఇండియన్ నేవీలో కొత్త శకం ఆవిష్కృతమైంది. నేవీ పైలెట్లుగా మహిళలు రంగ ప్రవేశం చేశారు. తమ అకాడ‌మీలో తొలి మహిళా బ్యాచ్ ను మొదలు పెట్టిన ఇండియ‌న్ నావ‌ల్.. అందులో ఉత్తీర్ణులైన వారిని బుధవారం ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఇందులో భాగంగా తొలి నేవీ పైలెట్‌గా శుభాంగి స్వరూప్ ఎంపికైంది. ఈమెతో పాటు మరి కొందరు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. శుభాంగి స్వరూప్ తో సహా ఎంపికైన వారందరూ హైద‌రాబాద్‌లోని దుండిగ‌ల్ నావల్ ఫోర్స్ అకాడ‌మీలో శిక్షణ పొందనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి మహిళా నావల్ ఆఫీసర్లు...
శుభాంగి స్వరూప్ తో పాటు మరో ముగ్గురు నావెల్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు. ఢిల్లీకి చెందిన ఆస్తా సెగల్, కేరళకు చెందిన శక్తిమయ, పుదుచ్చేరికి చెందిన రూప ఎ  నావికా దళం యొక్క నావెల్ అర్మాటం ఇన్స్పెక్టరేట్ (NAI) విభాగంలో నావల్ అధికారులుగా ఎంపికయ్యారు. దీంతో వీరు దేశం యొక్క మొట్టమొదటి మహిళా అధికారులుగా చరిత్ర సృష్టించారు.


శుభాంగి స్వరూర్ ప్రస్థానం..


 నేవీల్ విభాగంలో తొలి మహిళా పైలట్ గా ఎంపికైన  శుభాంగి స్వరూర్ స్వస్థలం యూపీలోని బ‌రేలీ ప్రాంతం. ఆమె ఇండియ‌న్ నావ‌ల్ అకాడ‌మీ మొద‌టి మ‌హిళ‌ల బ్యాచ్‌ కు చెందినది. కాగా నావాల్ అకాడమీలో కోర్సును విజవంతంగా పూర్తి చేసుకొని.. పరీక్షలో ప్రధమ స్థానంలో నిలిచింది శుభాంగి స్వరూర్ . ఈ నేపథ్యంలో ఆమె తొలి మహిళా పైలట్ గా ఎంపికైంది.


సరికొత్త శకం మొదలైంది..


మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటగల్గుతారని నిరూపించారు..నిరూపిస్తున్నారు కూడా.. ఇప్పటి వరకు రక్షణ రంగానికి దూరంగా ఉంటూ వచ్చిన మహిళలు ఇటీవలి కాలంలో ఆ రంగం కూడా అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఆర్మీ, ఎయిర్ పోర్స్ రంగంలో అడుగుపెట్టిన నారీ మణులు...ఇప్పుడు నేవీ రంగంలో కూడా బాధ్యతలు నిర్వర్తించేందుకు ముందుకురావడం శభుపరిణామం.