న్యూడిల్లీ: కరోనా ఆందోళన నేపథ్యంలో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని, సంకల్పాన్ని నింపాలన్న ఉద్దేశ్యంతో ప్రధాని మోదీ లైట్స్ కార్యక్రమానికి పిలుపిచ్చిన సంగతి తెలిసిందే.. ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు లైట్లు స్విచ్ఛాఫ్ చేయాలని, కరోనాపై పోరుకు సంఘీభావంగా రాత్రి తొమ్మిదిగంటలకు ప్రజలంతా తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ దీపాలు ఆపి చేయాలని అన్నారు. ప్రధాని ఇచ్చిన పిలుపు ఇళ్లలోని విద్యుత్ దీపాలకే వర్తిస్తుందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ తెలిపింది. లైట్స్ ఆపివేయడం కారణంగా పవర్ గ్రిడ్‌లలో అస్థిరతత నెలకొంటుందనే వాదనను విద్యుత్‌శాఖ తోసిపుచ్చగా పవర్ గ్రిడ్‌లు దెబ్బతినే ఆస్కారం లేదని స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విద్యుత్ వినియోగంలో పలు రకాల తేడాలతో ఉత్పన్నం అయ్యే స్థితిని పూర్తి స్థాయిలో ఎదుర్కొంటామని, భారతీయ ఎలక్ట్రిసిటి గ్రిడ్ సమర్థవంతమైనదని, సవాళ్ళను తట్టుకొంటుందని, విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పివేస్తే పవర్‌గ్రిడ్‌లు కుప్పకూలుతాయని, తీవ్రమైన విద్యుత్ అంతరాయ పరిస్థితి ఏర్పడుతుందనే వదంతులను నమ్మవద్దని విద్యుత్ శాఖ హితవు పలికింది. విద్యుత్ దీపాల బంద్ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు కేంద్రం సూచనలు వెలువరించిందని ఓ అధికారి తెలిపారు. 


ఈ కార్యక్రమంలో మొత్తం విద్యుత్ పరికరాలను ఆఫ్ చేయాల్సిన అవసరం లేదని, బల్బులు ఆఫ్ చేయడం కూడా స్వచ్ఛందమేనని, ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు, కంప్యూటర్లు, ఏసీలు నిలిపివేయాల్సిన అవసరం లేదని, వీధి లైట్లను ఆఫ్ చేయకూడదని, లైట్లు మాత్రమే ఆర్పివేయాలని సూచించారు. ఈ తొమ్మిది నిమిషాలలో కొవ్వొత్తులు వెలిగించాలని, కరోనాపై పోరుకు జాతి సంఘీభావం చాటుకుందామని తెలిపారు. ఆదివారం 5వ తేదీ రాత్రి 9 గంటలు…తొమ్మిది నిమిషాలను గుర్తుంచుకుని కర్తవ్యం పాటించాలని ప్రధాని మోదీ కోరారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..