Indian Presidential Election-2022: రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. ఈనెల 15న ఎన్నికల నోటిఫికేషన్‌ రానుంది. నామినేషన్ల దాఖలకు ఈనెల 29 వరకు గడువు ఉంది. వచ్చే నెల 18న రాష్ట్ర ఎన్నికకు పోలింగ్ జరగనుంది. 21న ఫలితాలు రానున్నాయి. ఈమేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్‌ ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికతోపాటు ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగనున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ పదవీకాలం వచ్చే నెల 24తో ముగియనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో ఎంపీలతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి ఓటు హక్కు ద్వారా ప్రథమ పౌరుడి ఎన్నిక జరుగుతుంది. రాజ్యసభ, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో నామినేటెడ్ సభ్యులు, ఎమ్మెల్సీలు ఎలక్టోరల్‌ కాలేజీలో సభ్యులుగా ఉండరు. వారికి ఓటు వేసే అవకాశం కల్పించరు. ఉపరాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. 


బ్యాలట్‌ పేపర్ విధానంలో ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. ఓటింగ్ సమయంలో ఉపయోగించే పెన్నును కేంద్ర ఎన్నికల సంఘమే అందజేస్తుంది. ఆ పెన్నుతోనే ఓటింగ్ వేయాల్సి ఉంటుంది. వేరే పెన్నుతో వేస్తే ఆ ఓటు చెల్లదు. ఈఎన్నిక ప్రక్రియ కోసం పార్టీలు..తమ సభ్యులకు విప్‌ జారీ చేయవు. అలా నిబంధనలు కూడా లేవు. హాజరు కావాలా వద్దా అన్నది వారి స్వేచ్ఛకే వదిలేస్తారు. ఎప్పటి నుంచో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 


ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో 776 ఎంపీలు ఉన్నారు. వారి ఓట్ల విలువ 5 లక్షల 43 వేల 200గా ఉంది. ఇటు 4 వేల 33 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి ఓటు విలువ 5 లక్షల 43 వేల 231గా ఉంది. వీటిలో ఎన్డీయేకి 49 శాతం, యూపీయేకి 24.02, ఇతర పార్టీలకు 26.98 శాతం బలం ఉంది. గతంతో పోలిస్తే ఈసారి బీజేపీ కూటమి బలం ఎక్కువగానే ఉంది. 2017లో జులై 17న రాష్ట్రపతి ఎన్నిక జరిగింది. గత ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలు దళిత అభ్యర్థులకే బరిలో నిలిపాయి. ఆ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి అన్నాడీఎంకే, వైసీపీ, జేడీయూ, బీజేపీ, టీఆర్ఎస్‌, ఐఎన్‌ఎల్‌డీ, ఇతర సభ్యులు మద్దతు ఇవ్వడంతో రామ్‌నాథ్‌ కోవింద్ ఘన విజయం సాధించారు. 


Also read:Ganga Dussehra 2022: గంగా దసరా రోజు ఇలా చేయండి..సకల భాగ్యాలు కల్గుతాయి..!


Also read:Vastu Tips: ఈఎమ్‌ఐ భారంతో ఇబ్బంది పడుతున్నారా..ఐతే ఇలా చేయండి..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook