Indian Presidential Election: త్వరలో రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌ రానుందా అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. వచ్చే నెల 25తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ పదవీ కాలం ముగుస్తుంది. ఈనేపథ్యంలో అప్పటిలోపు ఎన్నికలను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికల హడావిడి మొదలుకానుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఈసారి 776 మంది ఎంపీలు, 4 వేల 120 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తం ఓట్ల విలువ 10 లక్షల 98 వేల 903గా ఉంది. ఇందులో ఎంపీ ఓటు విలువ 708, అత్యధికంగా యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికలే టార్గెట్‌గా అధికార బీజేపీ పావులు కదుపుతోంది. అభ్యర్థి ఎంపికపై మంతనాలు జరుపుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ఉంచుతే బాగుంటుందన్న దానిపై ఆరా తీస్తోంది. ఈ జాబితాలో రోజుకో పేరు వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు ఆ అవకాశం ఉంటుందన్న ప్రచారం ఉంది.


ఈసారి గిరిజనులకు లేక మహిళలకు రాష్ట్రపతి పదవి దక్కే అవకాశం ఉందని గుసగుసలు వినినిపిస్తున్నాయి. మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, ఛత్తీస్‌ఘడ్‌ గవర్నర్ అనసూయ, కేంద్రమంత్రులు అర్జున్‌ ముండా, జుయల్ ఓరం పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తొలిసారి గిరిజనులకు అవకాశం ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మహిళా కోటాలో తెలంగాణ గవర్నర్ తమిళిసై అవకాశం దక్కుతుందన్న వార్త చక్కర్లు కొడుతోంది.


మాజీ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ పేర్లు కూడా లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మైనార్టీ కోటాలో ముక్తార్ అబ్బాస్ నక్వీ, కేరళ గవర్నర్ అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఉపరాష్ట్రపతులు..రాష్ట్రపతులుగా పనిచేసిన సందర్భాలు ఆరుసార్లు జరిగింది. అదే తరహాలో వెంకయ్యనాయుడు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈసారి కచ్చితంగా దక్షిణాది వారికి రాష్ట్రపతి పదవి వరిస్తుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.


Also read: Hyderabad gang rape case: హైదరాబాద్ గ్యాంగ్ రేప్‌ కేసులో ట్వీస్ట్..రిమాండ్ రిపోర్టులో ఏముందంటే..!


Also read:Thief Escape: బయ్యారం పోలీసుల ఆఫర్‌, ఆ రివార్డు మీకే రావొచ్చు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook