Indian Railway New Rules For Ticket Booking: భారతీయ రైళ్లలో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. కావల్సిన సీటు పొందేందుకు నెల ముందే బుక్ చేసుకుంటుంటారు. ఎందుకంటే చాలామందికి లోయర్ బెర్త్ లేదాసైడ్ లోయర్ అంటే ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇకపై అది సాధ్యం కాకపోవచ్చు. ఇండియన్ రైల్వేస్ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ రైల్వేస్ జారీ చేసిన కొత్త నియమ నిబంధనల ప్రకారం రైళ్లలో లోయర్ బెర్త్ అనేది ఇకపై కొన్ని కేటగరీలకే రిజర్వ్ చేయబడింది. వికలాంగులకు మాత్రమే లోయర్ బెర్త్ అనేది రిజర్వ్ చేయబడుతుంది. రైళ్లలో వికలాంగుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 


రైల్వే శాఖ ఆదేశాల ప్రకారం నాలుగు సీట్లు, రెండు బోటమ్, రెండు మిడిల్ సీట్లు, ధర్డ్ ఏసీలో రెండు, ధర్డ్ ఏసీ ఎకానమీలో రెండు సీట్లు వికలాంగులకు రిజర్వ్ చేశారు. ఆ వికలాంగుడికి తోడుగా ప్రయాణించే మరొకరు కూడా ఆ సీట్లో కూర్చోవచ్చు. అదే విధంగా 2 లోయర్, 2 అప్పర్ సీట్లు గరీభ్ రధ్‌లో వికలాంగులసు కేటాయించారు. ఎలాంటి రాయితీ ఉండదు. పూర్తి రసుము చెల్లించాల్సిందే. 


Also Read: Mother Emotional Letter: కన్నా ప్రపంచంలోనే అత్యుత్తమ కొడుకివి నువ్వే రా.. కన్నీళ్లు తెప్పిస్తున్న తల్లి లేఖ


ఇవి కాకుండా సీనియర్ సిటిజన్లకు కూడా లోయర్ బెర్త్ రిజర్వ్ చేసింది రైల్వే శాఖ. వృద్ధులకు అడగకుండానే కేటాయిస్తారు. స్లీపర్ తరగతిలో 6-7, ధర్డ్ ఏసీలో 4-5,  సెకెండ్ ఏసీలో 3-4 సీట్లను 45 ఏళ్లు పైబడినవారికి లేదా గర్భిణీ మహిళలకు కేటాయించారు. ఆప్షన్ ఎంచుకోకపోయినా ఈ సీట్లను వారికి కేటాయిస్తారు. మరోవైపు లోయర్ సీటు ఒకవేళ సీనియర్ సిటిజన్ కు కేటాయించి ఉండి, దివ్యాంగులు లేదా గర్భిణీ మహిళకు అప్పర్ సీట్ ఉంటే టీటీకు సీటు మార్చే అధికారముంటుంది. 


Also read: 7th Pay Commission: ఉద్యోగులకు శుభవార్త, డీఏ 51 శాతానికి పెంపు, ఎప్పట్నించంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook