రైల్వే శాఖ రైళ్ల రాకపోకల వేళలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రేపటి నుంచి(ఆగస్టు 15) వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. తాజాగా నార్తన్‌ రైల్వే జారీ చేసిన ప్రకటన ప్రకారం, 301 రైళ్ల రాకపోకల వేళలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రకటన ప్రకారం.. 57 రైళ్లు బయలుదేరాల్సిన సమయం కంటే ముందుగానే బయలుదేరుతాయి. మరొక 58 రైళ్లు బయలుదేరాల్సిన సమయం కంటే కొంత ఆలస్యంగా బయలుదేరుతాయి. అలాగే 102 రైళ్లు రావాల్సిన సమయం కంటే కొంత ముందుగానే గమ్యానికి చేరుకుంటాయి. మరొక 84 రైళ్లు కొంత ఆలస్యంగా చేరుకుంటాయి. ఈ కొత్త రైల్వే టైమ్‌ టేబుల్‌ ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని.. రైల్వే ప్రయాణీకులు ఈ మార్పును తప్పక గమనించాలని నార్తన్‌ రైల్వే శాఖ పేర్కొంది. సవరించిన రైల్వే టైమ్ టేబుల్ ప్రకారం, రైళ్ల రాకపోకల్లో ఐదు నుంచి రెండున్నర గంటల వ్యత్యాసం కనిపిస్తోంది.


సవరించిన రైళ్ల రాకపోకల వివరాలు (కొన్ని):


అమృత్సర్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, లక్నో మెయిల్, తేజస్ ఎక్స్‌ప్రెస్, హంసఫర్ ఎక్స్‌ప్రెస్, అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైళ్లను 5ని. ముందుకు జరిపారు. నీలాచల్ ఎక్స్‌ప్రెస్, డెహ్రాడూన్-అమృత్సర్ ఎక్స్‌ప్రెస్, జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల అరైవల్‌ను మరింత పొడిగించారు.