ప్రయాణికులకు మరింత మెరుగైన మౌళిక సదుపాయాలు అందించేందుకు లగేజీ, పార్సిల్ డెలివరి చార్జీలతోపాటు పలురకాల సరుకుల రవాణాపై చార్జీలను పెంచాలని భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో విడుదలైన ఓ నివేదిక ప్రకారం భారతీయ రైల్వే సంపాదిస్తున్న ప్రతీ రూ100 కోసం రూ.111 ఖర్చు చేస్తోంది. 2016లో ప్రతీ రూ.100 సంపాదనకు అంతకన్నా అదనంగా రూ.114 వెచ్చించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోంది. ఇండియన్ రైల్వే చేపట్టిన మౌళిక వసతుల విస్తరణ పనులలో రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత, బోగీల్లో మరింత మెరుగైన సౌకర్యాలు, అన్ని రకాల సౌకర్యాలతో వెయిటింగ్ రూమ్స్ నిర్మాణం వంటి ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ అభివృద్ది కార్యక్రమాలను ఇలాగే కొనసాగించేందుకు ఇకపై సరుకుల రవాణాపై చార్జీలను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైతులు, సామాన్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారధాన్యాలు, పిండి, పప్పుధాన్యాలు, ఎరువులు, ఉప్పు, చక్కర వంటి సరుకులపై ధరలను పెంచకుండా భారతీయ రైల్వే నిర్ణయం తీసుకోవడం విశేషం. అంతేకాకుండా సిమెంట్, పెట్రోలియం, డీజిల్ రవాణాపై సైతం ధరలు పెంచడం లేదు.


ధరలు పెరిగేవి:
బొగ్గు, ఇనుము, స్టీల్, ముడి ఇనుము, స్టాల్ ప్లాంట్స్‌కి సరఫరా చేసే ముడి సరుకులతోపాటు పలు ఇతర వస్తు రవాణాపై 8.75% రవాణా చార్జీలు పెరగనున్నాయి.