Indian Railways: రైలు ప్రయాణం ఓ అందమైన అనుభూతినిస్తుంది. సుదీర్ఘంగా సాగే పట్టాలపై రైలు అదుపు తప్పకుండా ప్రయాణిస్తుంటుంది. అసలు రైళ్లు పట్టాలపైనే ఎందుకు నడుస్తాయి, రోడ్లపై ఎందుకు వెళ్లవనే సందేహం అప్పుడప్పుడూ వస్తుంటుంది. ఆ సందేహాలకు సమాధానమిదే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ప్రతిరోజూ లక్షలాదిమంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అలసట లేని ప్రయాణం కావాలంటే రైలు ప్రయాణం అత్యంత అనువైంది. మీరు కూడా రైలు ప్రయాణం చేసేటప్పుడు..రైళ్లు పట్టాలపైనే ఎందుకు ప్రయాణిస్తాయని..రోడ్లపై ఎందుకు వెళ్లవనే సందేహాలు వస్తుంటాయి కదా..రైళ్ల కోసం ప్రత్యేకమైన రోడ్లు నిర్మిస్తే సరిపోతుంది కదా..అనే ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా..ఆ ప్రశ్నలకు సమధానం చూద్దాం..


రైళ్లు పట్టాలపైనే నడవడానికి పలు కారణాలున్నాయి ముఖ్యమైన కారణాల్లో ఒకటి బరువు మనం సాధారణంగా చూసే ట్రక్కు బరువు 15 నుంచి 20 టన్నులుంటుంది. అదే సరుకు రవాణా చేసేదైతే 100 టన్నుల కంటే అధికమే. ట్రక్ చక్రాల వెడల్పు 10 అంగుళాలుంటుంది. కానీ ట్రైన్ చక్రాల వెడల్పు కేవలం 4 ఇంచులే. అంటే రైళ్లు రోడ్లపై ప్రయాణించాలంటే..ఇప్పుడున్న రోడ్ల కంటే 10-12 పటిష్టంగా నిర్మించాల్సి ఉంటుంది. 


ఇక రెండవ కారణం చక్రాలు, సర్ఫేస్ మధ్య ఉండే ఘర్షణ. రోడ్లనేవి సాధారణంగా మట్టి, తారు, కంకరతో నిర్మితమౌతాయి. అటువంటి వాటిపై రైళ్లు ప్రయాణిస్తే చక్రాలు అందులో కూరుకుపోతాయి. అందుకే పట్టాలు వేసేటప్పుడు అడుగున స్లీపర వేసి లోడ్ ఎక్కువగా విస్తరించేలా చేస్తారు. అది కాకుండా రైలు పట్టాలు, చక్రాల మధ్య ఉండే ఘర్షణ చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా సులభంగా చక్రాలు ముందుకు సాగిపోతుంటాయి. అదే రోడ్డుపై అయితే ఘర్ఘణ ఎక్కువై..చక్రాలు ముందుకెళ్లడం కష్టంగా మారుతుంది. 


రోడ్లపై వెళ్లే అన్ని వాహనాలకు స్టీరింగ్ ఉంటుంది. ఫలితంగా కంట్రోల్ సాధ్యమౌతుంది. కానీ ట్రైన్‌లో స్టీరింగ్ వ్యవస్త ఉండదు. అందుకే రైళ్లను రోడ్లపై నడపడం సాధ్యం కాదు. రైలు బరువు, ఘర్షణ, స్టీరింగ్ లేకపోవడం వంటి కారణాలతో రైళ్లు పట్టాలపైనే నడపాల్సి వస్తుంది. 


Also read: Bihar Hooch Tragedy: బీహార్‌లో ఘోర విషాదం.. కల్తీ మద్యం తాగి 11 మంది మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook