ఇండియన్ రైల్వేస్ అంటేనే అతి పెద్ద సామ్రాజ్యం. భారతీయ రైల్వేకు సంబంధించి చాలామందికి తెలియని ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. ఇవి తెలుసుకుంటే ఓ భారతీయుడిగా గర్వపడతారు. ఇండియన్ రైల్వేస్‌లో ఇన్ని ప్రత్యేకతలున్నాయా అని ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ. ఇండియన్ రైల్వేస్‌లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఒక్కొక్కటి వింటే చాలా గర్వపడతారు. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే ప్లాట్‌ఫామ్ పొడుగు ఎంత, ఎక్కడ ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది ఇండియాలోనే ఉంది. దీని పొడుగు 1366.4 మీటర్లు అంటే దాదాపుగా ఒకటిన్నర కిలోమీటరు. ఓ మూల నుంచి మరో మూలకు వెళ్లడం చాలా కష్టం. మరింత వివరంగా ఇతర వివరాలు తెలుసుకుందాం..


ప్రపంచంలో అతిపెద్ద రైల్వే ప్లాట్‌ఫామ్


ప్రపంచంలో అతిపెద్ద రైల్వే ప్లాట్‌ఫామ్ యూపీలోని గోరఖ్‌పూర్ జంక్షన్. ఈ జంక్షన్ నార్త్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో వస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ రీమోడలింగ్ పని 2013లో పూర్తయింది. ఆ తరువాత ఈ స్టేషన్ పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కింది. ఈ రైల్వే ప్లాట్‌ఫామ్ నెంబర్లు 1,2ల పొడవు దాదాపుగా 1366.4 మీటర్లు. ప్రపంచంలో ఇంతకంటే పొడవైన ప్లాట్‌ఫామ్ మరొకటి లేదు. 


బ్రేక్ అయిన ఖరగ్‌పూర్ రికార్డ్


ఇంతకుముందు  కూడా ప్రపంచంలో అతి పెద్ద రైల్వే ప్లాట్‌ఫామ్ రికార్డు ఇండయన్ రైల్వేస్‌కే ఉండేది. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ ఇది. ఈ ప్లాట్‌ఫామ్ పొడవు 1072.5 మీటర్లు ఉంది. అయితే రీ మోడలింగ్ పనులు తరువాత ఈ రికార్డును గోరఖ్‌పూర్ రైల్వే‌స్టేషన్ బ్రేక్ చేసింది. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ 1,2 ప్లాట్‌ఫామ్‌ల పొడవు ఇంతకంటే ఎక్కువే. 


రోజుకు 170 రైళ్లు


ఓ నివేదిక ప్రకారం గోరఖ్‌పూర్ జంక్షన్ ప్లాట్‌ఫామ్ ఎంత పెద్దదంటే..26 కోచ్‌లు కలిగిన రెండు రైళ్లు ఒకేసారి అక్కడ నిలపవచ్చు. ఈ జంక్షన్‌కు రోజుకు పెద్ద సంఖ్యలో రైళ్ల రాకపోకలు జరుగుతుంటాయి. రోజుకు 170 రైళ్లు వెళ్తుంటాయి.


Also read: NITI Aayog New CEO: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా బీవీఆర్ సుబ్రమణ్యం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook