Indian Railways New Rules: భారతీయ రైల్వే లోయర్ బెర్త్ విషయంలో కీలకమైన నియమాలు జారీ చేసింది. ఇకపై రైళ్లలో లోయర్ బెర్త్ అనేది వికలాంగులకు రిజర్వ్ కానుంది. వికలాంగులు, దివ్యాంగుల ప్రయాణ సౌకర్యార్ధం రైల్వే ఈ మార్పులు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతీయ రైళ్లలో రోజుకు లక్షలాదిగా ప్రయాణిస్తుంటారు. అనువైన సీట్ కోసం నెల ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటుంటారు. చాలామంది సైడ్ లోయర్ బెర్త్ లేదా లోయర్ బెర్త్ ఇష్టపడుతుంటారు. ఇప్పుడిక ఆ అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ కొన్ని మార్పులు చేర్పులు చేసింది. కొత్త నియమాలు జారీ చేసింది. దీని ప్రకారం రైళ్లలో లోయర్ బెర్త్ అనేది కొంతమందికి మాత్రమే రిజర్వ్ చేయబడుతుంది. ఎవరెవరికి లోయర్ బెర్త్ వర్తిస్తుందో తెలుసుకుందాం. లోయర్ బెర్త్ అనేది ఇకపై దివ్యాంగులు, వికలాంగులకు రిజర్వ్ చేయబడుతుంది. 


రైల్వే శాఖ జారీ చేసిన కొత్త ఆదేశాల ప్రకారం థర్డ్ ఏసీలో నాలుగు సీట్లు అందులో రెండు లోయర్, రెండు మిడిల్ బెర్త్ సీట్లు, స్లీపర్‌లో 2 సీట్లు వికలాంగులకు రిజర్వ్ అయి ఉంటాయి. అదే విధంగా గరీభ్ రధ్‌లో 2 లోయర్, 2 అప్పర్ సీట్లు రిజర్వ్ అవుతాయి. 


అదే విదంగా సీనియర్ సిటిజన్లకు కూడా లోయర్ బెర్త్ కేటాయిస్తారు. స్లీపర్ తరగతిలో 6-7, ధర్డ్ ఏసీలో 4-5, సెకండ్ ఏసీలో 3-4 లోయర్ బెర్త్ సీట్లు 45 ఏళ్లు దాటినవారికి కేటాయిస్తారు. ఆప్షన్ ఎంచుకోకపోయినా వయస్సుని బట్టి కేటాయింపు ఉంటుంది. అదే విధంగా గర్భిణీ మహిళలకు కూడా కేటాయిస్తారు. అదే సమయంలో ఒకవేళ లోయర్ బెర్త్ సీనియర్ సిటిజన్‌కు కేటాయింపబడి ఉండి..దివ్యాంగులు లేదా గర్భిణీ మహిళ అప్పర్ సీట్‌లో ఉంటే చెకింగ్ సందర్భంగా టీటీ వారికి లోయర్ బెర్త్ మార్చేందుకు అధికారముంటుంది. 


Also read: ATM Franchise Business: ఏటీఎం ఫ్రాంచైజ్‌తో నెలకు 60 వేలు సంపాదన, ఎలాగంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook