Indian Railways palans to hire 1,48,463 employees in next one year: దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. రానున్న సంవత్సర కాలంలో లక్షా 48వేల 463 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. గడిచిన ఎనమిది ఏళ్లలో ఏడాదికి సగటున 43,678 కొత్త ఉద్యోగాలు భర్తీ చేశామని, ఈ ఏడాది ఆ సంఖ్యను భారీగా పెంచినట్లు రైల్వేశాఖ చెప్పింది. రాబోయే 18 నెలల్లో 10 లక్షలకు పైగా నూతన ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించిన వెంటనే రైల్వేశాఖ ఈ ప్రకటన చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్చి 1 2020 నాటికి 31.91 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలు కలుపుకుని మొత్తంగా ఉండాల్సిన సంఖ్య 40.78 లక్షలు. దాదాపు 21.75 శాతం (8.87 లక్షలు) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో దాదాపు 92 శాతం మ్యాన్ పవర్ రైల్వే, రక్షణ, హోంశాఖ, పోస్టల్, రెవెన్యూ శాఖల్లోనే ఉంది. రైల్వేశాఖలోనే 40.55 శాతం ఉంది. అంటే రైల్వేశాఖలోనే అధిక ఉద్యోగాలు ఉండనున్నాయి. 


2014-15 నుంచి 2021-22 వరకు రైల్వేశాఖ మొత్తంగా 3,49,422 లక్షల కొత్త ఉద్యోగాలను భర్తీ చేసింది. ఏడాదికి సగటున 43,678 ఉద్యోగాలు భర్తీ చేసింది. 2022-23లో కొత్త ఉద్యోగాల సంఖ్యను భారీగా పెంచనుంది. ఈ ఏడాదికి 1,48,463 మందిని భర్తీ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాలను (కేంద్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో) భర్తీ చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిరుద్యోగం అంశంపై ప్రతిపక్షాలు విరుచుకుపడడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 


Also Read: వాహనదారులకు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ ప్లేట్లు తప్పనిసరి! పాత వాహనాలకు కూడా


Aso Read: కశ్మీర్ పండిట్ల హత్యలు, గో హత్యలకు తేడా ఏముంది.. సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు!  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook