Paragliding Places: థ్రిల్లింగ్, సాహసం కలిగిన పర్యాటకులు అత్యంత ఇష్టపడేది పారాగ్లైడింగ్. ఇండియాలో కూడా అద్భుతమైన పారాగ్లైడింగ్ ప్రాంతాలున్నాయి. అవేంటో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలామంది పర్యాటకులకు థ్రిల్లింగ్, అడ్వెంచర్ చేయాలనుంటుంది. అలాంటి వ్యక్తులు ఎక్కువగా ఇష్టపడేది పారాగ్లైడింగ్. అడ్వెంచరస్, థ్రిల్లింగ్ రెండూ ఉంటాయి ఇందులో. ఇండియాలో పారాగ్లైడింగ్ కోసం బెస్ట్ స్పాట్స్ 7 ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..


గాలిలో ఎగురుతూ..విహరిస్తూ..ఉండాలంటే నిజంగా ఒక థ్రిల్లింగ్. ఎంజాయ్ చేయాలని అందరికీ ఉంటుంది. కానీ ధైర్యం ఉండాలి. సెక్యూరిటీ ఉన్నా..ధైర్యం లేకుంటే ప్రాణాలు జారిపోతాయి. అదే పారాగ్లైడింగ్. ఇటీవల కొద్దికాలంగా పారాగ్లైడింగ్ ఆసక్తి పెరుగుతోంది. మరే ఇతర ప్రక్రియలోనూ ఇంతటి అనుభూతి, థ్రిల్లింగ్ లభించదు. ఇండియాలో ఉన్న ఆ ఏడు పారాగ్లైడింగ్ కేంద్రాల గురించి తెలుసుకుందాం..


ఇండియాలో పారాగ్లైడింగ్ టికెట్ వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంది. పారాగ్లైడింగ్ టికెట్ మీ రైడింగ్ సమయం, ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. పారాగ్లైడింగ్ టికెట్ 1000 నుంచి 5000 వరకూ ఉంటుంది. 


వాగామోన్, కేరళ


వాగామోన్ పారాగ్లైడింగ్ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రాంతం. వాగామోన్ అనేది భూమి నుంచి 3వేల మీటర్ల ఎత్తులో ఉన్న కేరళలోని అందమైన ప్రాంతం. ఇక్కడి అందమైన సుందర దృశ్యాలపైనుంచి పారాగ్లైడింగ్ చేయడం నిజంగానే అద్భుతమైన అనుభూతినిస్తుంది. 


జోథ్‌పూర్, రాజస్థాన్


జోథ్‌పూర్‌లోని షాహీ మహర్ అందం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. జోథ్‌పూర్‌లో 1500 అడుగుల ఎత్తులో పారాగ్లైడింగ్ ఆనందాన్ని పొందవచ్చు. రాజస్థాన్ వేడిమి మధ్య ఆకాశంలో ఎగురుతూ ఎంజాయ్ చేయవచ్చు


పంచ్‌గనీ, మహారాష్ట్ర


మహారాష్ట్రలోని పంచ్‌గనీ ఓ అందమైన హిల్ స్టేషన్. ఇది భూమి నుంచి 1200 మీటర్ల ఎత్తులో ఉంది. పంచ్‌గనీ వాతావరణం చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు పారాగ్లైడింగ్‌లో ఆసక్తి ఉంటే పంచ్‌గనీ మంచి ప్రాంతం కాగలదు.


బీర్‌బిలింగ్, హిమాచల్ ప్రదేశ్


హిమాచల్ ప్రదేశ్‌లోని బీర్‌బిలింగ్ ఓ అందమైన కొండ ప్రాంతం. ఇక్కడ పారాగ్లైడింగ్ అద్భుతంగా ఉంటుంది. ట్రైనర్స్, రక్షణ ఏర్పాట్లు కూడా బాగుంటాయి.


నైనితాల్, ఉత్తరాఖండ్


ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ తెలియనివారెవరూ ఉండరు. అందమైన పర్యాటక ప్రాంతమిది. భూమి నుంచి 2000 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం పారాగ్లైడింగ్‌కు అనువైన ప్రదేశం. కొండల్లో, లోయల్లోంచి ఆకాశంలో ఎగురుతూ అద్భుతమైన అందమైన దృశ్యాల్ని తిలకించవచ్చు.


షిల్లాంగ్, మేఘాలయ


మేఘాలయలోని షిల్లాంగ్ మరో అందమైన ప్రాంతం. ఇక్కడ పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. షిల్లాంగ్‌లో 700 మీటర్ల ఎత్తులో పారాగ్లైడింగ్ చేయడం అద్భుతమైన అనుభూతినిస్తుంది. 


గ్యాంగ్‌టక్, సిక్కిం


గ్యాంగ్‌టక్ దేశంలోని మరో ప్రాచుర్యం కలిగిన పర్యాటక ప్రదేశం. ఇక్కడికి పారాగ్లైడింగ్ కోసమే కాకుండా ఇతర అందమైన ప్రాంతాల్ని చూసేందుకు వస్తుంటారు. గ్యాంగ్‌టక్ అత్యంత అనువైన బెస్ట్ పర్యాటక ప్రదేశం.


Also read: NEET: లోదుస్తులు విప్పించిన వివాదం.. ఆ విద్యార్థినులకు మరో ఛాన్స్ ఇచ్చిన ఎన్‌టీఏ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook