First H3N2 Influenza Death in India: ఇండియాలో H3N2 వైరస్‌తో తొలి మరణం నమోదు
First H3N2 Influenza Death in India: ఇప్పటివరకు దేశంలో దాదాపు 90 మంది వరకు H3N2 వైరస్ సోకినట్టు గుర్తించారు. మరో 8 మందికి H1N1 వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. మార్చి నెల ఆఖరు నాటికి కేసులు పూర్తిగా తగ్గిపోతాయనే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
First H3N2 Influenza Death in India: గత కొద్ది రోజులుగా ఇండియాను వణికిస్తున్న H3N2 వైరస్ కారణంగా తొలి మరణం నమోదైంది. కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందిన 82 ఏళ్ల వృద్ధుడు H3N2 వైరస్ తో మృతి చెందాడు. భారత్ లో H3N2 వైరస్ తో బాధపడుతూ చనిపోయిన తొలి వ్యక్తిగా ఈ కేసు నమోదైంది. ఫిబ్రవరి 24న హిరే గౌడ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా.. మార్చి 1న అతడు తుది శ్వాస విడిచాడు. అతడికి డయాబెటిస్, హైపర్ టెన్షన్ కూడా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
ఇదిలావుంటే, హర్యానాలోనూ H3N2 వైరస్ కారణంగా మరొకరు మృతి చెందినట్టు తెలుస్తోంది. హర్యానాలోని జింద్ కి చెందిన 56 ఏళ్ల వ్యక్తికి కూడా జనవరిలోనే H3N2 వైరస్ సోకినట్టు గుర్తించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న ఈ వ్యక్తి బుధవారం తన నివాసంలోనే కన్నుమూశాడు. దేశంలో ఈ రెండు మరణాలను H3N2 వైరస్ కారణంగా చనిపోయిన వారిగా గుర్తించారు.
ఇప్పటివరకు దేశంలో దాదాపు 90 మంది వరకు H3N2 వైరస్ సోకినట్టు గుర్తించారు. మరో 8 మందికి H1N1 వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. మార్చి నెల ఆఖరు నాటికి కేసులు పూర్తిగా తగ్గిపోతాయనే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ ని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది.
ఇది కూడా చదవండి : Stroke cases: ఆందోళన కల్గిస్తున్న స్ట్రోక్ కేసులు, ప్రతి 4 నిమిషాలకు ఒకరి మరణం
ఇది కూడా చదవండి : Ritesh Agarwal Father Death: ఓయో ఫౌండర్ ఇంట్లో తీవ్ర విషాదం.. పెళ్లి అయిన మూడు రోజులకే..
ఇది కూడా చదవండి : Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో కీలక మలుపు, వాంగ్మూలం వెనక్కి తీసుకున్న పిళ్లై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo