ఐదు ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థవైపు భారత్ పయనం - ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్
బడ్జెట్ 2019 ప్రవేవపెట్టే సందర్భంలో ఆర్ధిక మంత్రి నిర్మాల సీతారామన్ భారత ఆర్దిక లక్ష్యాలను సభ ముందు ఉంచారు
ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో బడ్జెట్-2019ను ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా తమ ప్రభుత్వం ఆర్ధిక లక్ష్యాలని సభ ముందు ఉంచారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ గత ఐదేళ్లలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు అమలు చేశామన్నారు. పరోక్ష పన్నులు, నిర్మాణ రంగం, దివాళ స్మృతిలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాన్నారు. ఐదేళ్లలోనే దేశ ఆర్థిక వ్యవస్థ విలువను లక్ష కోట్ల డాలర్లు పెంచామన్నారు.
ఎన్డీయే అధికారంలోకి వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల డాలర్లుగా ఉంది. ప్రస్తుతం భారత్ 2.5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగల దేశంగా మారిందన్నారు. గత ఐదేళ్లలో పన్ను విధానం, రుణాల ఎగవేత నియంత్రణలో పలు మార్పులు తీసుకువచ్చామన్నారు.
ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి మాట్లాడుతూ నవ భారత రూప కల్పనకు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. తాము ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థవైపునకు దూసుకెళ్తున్నామని తెలిపారు. వచ్చే దశాబ్ద కాలానికి అనుకున్న ఆర్ధిక లక్ష్యాలను అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ లక్ష్యానికి చేరుకునేందుకు ప్రధానంగా పది అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇలా దీర్ఘకాలిన ప్రయోజనాలను అంశాల స్ఫూర్తిగా ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేశామని తెలిపారు.