‘India's redefined drone tech being used in vaccine supply, agriculture,’ says PM during Mann Ki Baat address: 100 కోట్ల డోసులు పూర్తయిన క్రమంలో దేశం సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ప్రధాని ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat) 82వ ప్రసంగం చేశారు. దేశంలో పెరుగుతున్న డ్రోన్ల (Drone) ప్రాధాన్యంపై ప్రదాని మాట్లాడారు. యువత దృష్టిని ఇవి ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని మోదీ తెలిపారు. గతంలో డ్రోన్ల రంగం అనేక ఆంక్షలు, నిబంధనలతో ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, కొత్త డ్రోన్ పాలసీ..ఇప్పటికే మంచి ఫలితాలను చూపుతోందన్నారు. వ్యాక్సిన్ సప్లైతో (vaccine supply) వ్యవసాయ రంగంలో డ్రోన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక కోవిడ్ వ్యాక్సినేషన్‌ (Covid Vaccination‌) కార్యక్రమం సక్సెస్.. భారత్ సామర్థ్యాన్ని చూపుతోందన్నారు. ఆరోగ్య కార్తకర్తల కృషితో ఇది సాధ్యమైందన్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌కు (Uttarakhand‌) చెందిన ఆరోగ్య కార్యకర్త పూనమ్ నౌటియాల్‌తో మోదీ మాట్లాడారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఆమె అనుభవాలు, ఎదురైన సవాళ్ల గురించి అడిగి తెలుసుకున్నారు.


Also Read : IND vs PAK: కేవలం ఆటగానే చూడండి...యుద్ధంగా కాదు..: మహ్మద్ కైఫ్


అక్టోబర్ 31న ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్‌ పటేల్ (Sardar Vallabhbhai Patel) జయంతి సందర్భంగా ఆయన సంబంధించిన గొప్పతనాన్ని గుర్తు చేశారు మోదీ. దేశభక్తి, ఐక్యత విషయంలో పటేల్ నుంచి ప్రేరణ పొందాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి పరిరక్షణకు భారత్‌ విశేష సహకారం అందజేస్తోందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 



 


ఐరాస దినోత్సవం పురస్కరించుకుని.. ఐరాస శాంతి పరిరక్షణ దళాలకు భారత్‌ అందిస్తోన్న తోడ్పాటును ప్రధాని మోదీ ప్రస్తావించారు. దేశ పోలీసు వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరిగిందని ప్రధాని మోదీ (Narendra Modi) వెల్లడించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేయాలని మరోసారి పిలుపునిచ్చారు. దీపావళికి ఇళ్లను శుభ్రపరిచే క్రమంలో, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.


Also Read : Bipin Rawat: అఫ్గానిస్థాన్‌ నుంచి జమ్మూకశ్మీర్‌కు వలసలు పెరిగే అవకాశం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook