రికార్డు దిశగా కరోనా గ్రాఫ్..!!
`కరోనా వైరస్` కేసులు ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు శరవేగంగా కరోనా గ్రాఫ్ పెరిగిపోతోంది. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇంకా ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
'కరోనా వైరస్' కేసులు ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు శరవేగంగా కరోనా గ్రాఫ్ పెరిగిపోతోంది. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇంకా ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
భారత దేశంలో ఒక్క రోజులో 5 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 12 వేల 359కి చేరుకుంది. గత 24 గంటల్లోనే 5 వేల 609 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 63 వేల 624 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారికి 3 వేల 435 మంది మృతి చెందారని తెలిపింది. మొత్తంగా 45 వేల 300 మంది కరోనా రోగులకు చికిత్స అందించి సురక్షితంగా ఇంటికి పంపినట్లు వెల్లడించింది.
కాంగ్రెస్‌ది కపట నాటకం..!!
గత 24 గంటల్లో 132 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ఐతే రికవరీ రేటు మరి కాస్త పెరగడం విశేషం. ప్రస్తుతం రికవరీ రేటు 40.31 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. 39 వేల 297 కేసులతో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉండగా.. తమిళనాడు 13 వేల 191 కేసులతో రెండో స్థానంలో.. ఆ తర్వాత 12 వేల 537 కేసులతో గుజరాత్ మూడో స్థానంలో ఉన్నాయి.
మొత్తం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 49 లక్షలకు చేరుకుంది. ఇప్పటికే 3 లక్షల 20 వేల మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..