ఇండిగో సంస్థ వింటర్ సేల్ ఆఫర్‌లో భాగంగా విమాన టిక్కెట్లపై భారీ తగ్గింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 10 లక్షల టికెట్లకు ఈ తగ్గింపు ధరలను వర్తింపు చేయాలని చూస్తోంది. రూ.899 నుండి ఈ ధరలు ప్రయాణికులకు  అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. విదేశీ రూట్లలో ఇవే రేట్లు రూ.3,199 నుండి మొదలవుతున్నాయి. అయితే రూ.899 టికెట్ల ఆఫర్‌కు ముగింపు తేదిని నవంబరు 25 గా నిర్ణయించడం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిసెంబరు 6, 2018 నుండి  ఏప్రిల్ 15, 2019 తేదిల మధ్య ప్రయాణించే యాత్రికులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ తెలిపింది. భారతదేశంలోని ఇండిగో డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ మొత్తం ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలుస్తోంది. ఇదే ఆఫర్‌లో భాగంగా భారీ రాయితీలు ప్రకటించిన సంస్థ దేశీయ నెట్ వర్క్స్‌లో వన్ వే ప్రయాణం చేసే యాత్రికులకు టికెట్లను ఇప్పటికే పలు చోట్ల రూ.999 కు విక్రయిస్తున్నట్లు తెలిపింది. అలాగే మొబైల్ వాలెట్ ప్రొవైడర్ మోబీవిక్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే అదనంగా..రూ.600 క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు ఇండిగో తెలిపింది.


జులై 2018లో కూడా ఈ మాదిరి ఆఫర్స్‌తోనే ఇండిగో సంస్థ ప్రయాణికులను ఆకట్టుకుంది. అదే నెలలో దాదాపు 1.2 మిలియన్ టికెట్లను సంస్థ విక్రయించడం జరిగింది. అప్పుడు రూ.1,212 నుండి ఆఫర్లను ప్రారంభించడం జరిగింది.  ఈ మధ్యకాలంలో పండగ సీజన్లను బట్టి కూడా ఇండిగో విరివిగా ఆఫర్లు ప్రకటిస్తోంది.