India vs China: తూర్పు లడ్డాఖ్‌లో కీలక పరిణామం
Indo vs China faceoff: న్యూఢిల్లీ: ఇండో చైనా సరిహద్దులో ( Indo-China border ) ఉద్రిక్తతల్ని తగ్గించే దిశగా ఇరుదేశాలు కీలక అడుగు వేస్తున్నాయి. ఇరుదేశాల మధ్య జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం ఇరు దేశాల సైన్యం తూర్పు లడ్డాఖ్ ( East Laddakh ) నుంచి వెనక్కి తగ్గుతుందా అనేది గమనించాల్సి ఉంది.

( Also read : Indo-China war: ఇండో చైనా వార్ జరిగితే.. ఇండియాదే పై చేయి అంటున్న నివేదిక )
ఇండియా చైనా దేశాల మధ్య జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి ( Corps commander level meeting ) భేటీ శాంతిపూర్వక వాతావరణంలో సఫలమైంది. ఇండో చైనా సరిహద్దు వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని తొలగించేందుకు రెండు దేశాలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ నిర్ణయం మేరకు తూర్పు లడ్డాఖ్ ( East Laddakh ) నుంచి రెండు దేశాల ఆర్మీ వెనక్కి తగ్గనుంది.
( Also read: Army Chief in Laddakh: లఢక్‌లో ఆర్మీ చీఫ్... సైనికులకు పరామర్శ )
వాస్తవాధీన రేఖ ( LAC ) వెంబడి మే 2 నాటి పరిస్థితిని పునరుద్ధరించాలన్నది భారత దేశ వాదనగా ఉంది. తొలిదశలో జరిగిన భేటీలో సానుకూల వాతావరణం కన్పించకపోవడంతో ఈ చర్చలు ఇంకా కొనసాగనున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ ఆర్మీ ఛీఫ్ జనరల్ ఎంఎం నర్వణే ( Army chief MM Narwane ) లడ్డాఖ్‌కు చేరుకుని...14 మంది కోర్ అధికారులతో క్షేత్రస్థాయి పరిస్థితిపై సమీక్షించారు. చైనాతో జరిగిన చర్చలు సఫలమవడంతో ఈ సమీక్ష కొనసాగింది.
(Also read: India vs China: తూర్పు లడ్డాఖ్‌లో కీలక పరిణామం )
రెండు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి భేటీ దాదాపు 12 గంటలపాటు కొనసాగింది. ఈ భేటీలో సరిహద్దుపై తలెత్తిన ఉద్రిక్తతల్ని తొలగించే దిశగా రెండు దేశాల సైన్యం వెనక్కి తగ్గేందుకు నిర్ణయం తీసుకున్నాయి. గాల్వన్ లోయలో ( Galwan Valley ) జరిగిన హింసాత్మక ఘర్షణల నేపధ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..