కోట: రాజస్తాన్‌లోని కోటలో జెకె లోన్ ఆస్పత్రిలో గత డిసెంబర్ నుంచి మృతిచెందిన శిశువుల సంఖ్య తాజాగా 100కు చేరింది. డిసెంబర్ 30న ముగ్గురు, డిసెంబర్ 31న మరో ఐదుగురు శిశువులు మృతిచెందినట్టు ఆస్పత్రిలో చిన్నపిల్లల విభాగానికి ( Pediatric department ) అధిపతి అయిన డా అమృత్ లాల్ భైర్వ తెలిపారు. డిసెంబర్ 24 నాటికే మృతిచెందిన శిశువుల సంఖ్య 77కు చేరగా తాజాగా ఆ సంఖ్య 100కు చేరడం కలకలం రేపుతోంది. చనిపోయిన శిశువుల్లో అప్పుడే పుట్టిన వారు, రోజుల వయస్సున్న వారే అధికంగా ఉన్నారు. చనిపోయిన శిశువులు అందరూ తక్కువ బరువుతో పుట్టడంతో పాటు హైపోథెర్మియా ( Hypothermia ) అనే వ్యాధితో బాధ పడుతున్నట్టు డా అమృత్ లాల్ భైర్వ పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో ఎప్పుడూ లేనివిధంగా కొన్ని రోజుల వ్యవధిలోనే 100 మంది శిశువులు మృతిచెందడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. ఈ ఘటనపై చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి కృషిచేయాల్సిందిగా రాజస్తాన్ సర్కార్‌ని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కి గురువారం ఓ లేఖ రాశారు. సమస్య పరిష్కారం కోసం కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అందించడానికైనా తాము సిద్ధమేనని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తన లేఖలో స్పష్టంచేశారు. 


[[{"fid":"180845","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"రాజస్తాన్‌లో కలకలం రేపుతున్న శిశు మరణాలు","field_file_image_title_text[und][0][value]":"Infants death toll reaches 100 in Kota of Rajastan"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"రాజస్తాన్‌లో కలకలం రేపుతున్న శిశు మరణాలు","field_file_image_title_text[und][0][value]":"Infants death toll reaches 100 in Kota of Rajastan"}},"link_text":false,"attributes":{"alt":"రాజస్తాన్‌లో కలకలం రేపుతున్న శిశు మరణాలు","title":"Infants death toll reaches 100 in Kota of Rajastan","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇదిలావుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సైతం ఈ ఘటనపై స్పందించారు. శిశువుల మృతి ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందించాల్సిందిగా సోనియా గాంధీ రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కి ఓ లేఖ రాశారు. అంతకంటే ముందుగానే ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ స్పందిస్తూ.. ''చిన్నారుల మృతిపై రాజస్తాన్ ప్రభుత్వం సైతం చింతిస్తోందని.. దీనిపై రాజకీయాలు చేయకూడదు'' అని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కేంద్రం నుంచి ఓ ప్రత్యేక బృందం వచ్చి రాష్ట్రంలో పర్యటించి సమస్యను పరిష్కరిస్తే స్వాగతిస్తామని గెహ్లట్ అన్నారు. రాజస్తాన్‌లో 2003లో తొలిసారిగా చిన్నారుల కోసం ఐసియూ ఏర్పాటు చేసింది తమ సర్కారేనని.. అలాగే 2011లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కోటాలోని ఆసుపత్రిలోనూ ఐసియూ ఏర్పాటు చేశామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వివరణ ఇచ్చారు.