INS Vikrant: భారత అమ్ముల పొదిలోకి ఐఎన్ఎస్ విక్రాంత్.. నేడు నావిక దళానికి అప్పగించనున్న ప్రధాని మోదీ
PM Modi to commission INS Vikrant today : రక్షణ రంగంలో భారత్ మరో మైలు రాయిని చేరింది. ఐఎన్ఎస్ విక్రాంత్ రాకతో రక్షణ రంగంలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచింది.
PM Modi to commission INS Vikrant today: భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (సెప్టెంబర్ 2) లాంచ్ చేయనున్నారు. కేరళలోని కొచ్చి షిప్ యార్డ్‌లో నేటి ఉదయం 9.30 గంటలకు ప్రధాని మోదీ ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించి జాతికి అంకితం ఇస్తారు. భారత్ మొట్టమొదటిసారి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ విమాన వాహక నౌక నేటి నుంచి నావికా దళంలో భాగం కానుంది. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు చైనా దూకుడుగా ముందుకెళ్తున్న తరుణంలో ఐఎన్ఎస్ విక్రాంత్ భారత అమ్ములపొదిలో చేరడం దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది.
అసలు యుద్ధ వాహక నౌక అంటే ఏమిటి :
యుద్ధ వాహక నౌక అంటే.. యుద్ధ అవసరాలను బట్టి ఎయిర్‌బేస్‌గా ఉపయోగించుకునే నౌక. యుద్ధ సమయాల్లో దీనిపై ఫైటర్ జెట్స్‌ను మోహరించి శత్రు దేశాల ఫైటర్ జెట్స్‌ను, జలాంతర్గాములను టార్గెట్ చేయవచ్చు. యుద్ధ వాహక నౌక ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణించదు. దీని చుట్టూ విధ్వంసక నౌకలు, ఆయుధ సామాగ్రి మోసుకొచ్చే నౌకలు కూడా ఉంటాయి.
ఐఎన్ఎస్ విక్రాంత్ విశేషాలు
ఐఎన్ఎస్ విక్రాంత్‌ను తయారుచేసేందుకు దాదాపుగా 13 ఏళ్లు పట్టింది. ఇందుకోసం దాదాపుగా రూ.20 వేల కోట్లు ఖర్చు చేశారు.
దేశంలోని ప్రధాన పరిశ్రమలు, 100 చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఐఎన్ఎస్ విక్రాంత్ విడి భాగాలు తయారయ్యాయి.
ఐఎన్ఎస్ విక్రాంత్ 262 మీ పొడవు 62 మీ. వెడల్పు ఉంటుంది. ఇది రెండు హాకీ మైదానాలతో సమానం.
ఐఎన్ఎస్ విక్రాంత్ బరువు 43 వేల టన్నులు ఉంటుంది. గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.
MiG-29K, ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్ సహా ఒకేసారి దీనిపై 30 యుద్ధ విమానాల వరకు పార్క్ చేయవచ్చు.
ఐఎన్ఎస్ విక్రాంత్‌లో మొత్తం 14 అంతస్తులు 2300 కంపార్ట్‌మెంట్స్ ఉంటాయి. దాదాపు 1600 మంది సిబ్బంది ఉంటారు.
ఐఎన్ఎస్ విక్రాంత్‌లో అధునాతన ఫిజియోథెరపీ క్లినిక్, ఐసీయూ, లేబోరేటరీ, ఐసోలేషన్ వార్డులతో పూర్తి స్థాయి మెడికల్ కాంప్లెక్స్ అందుబాటులో ఉంది.
ఐఎన్ఎస్ విక్రాంత్‌తో రక్షణ రంగంలో భారత్ అగ్రశ్రేణి దేశాలైన అమెరికా, బ్రిటన్,రష్యా, చైనా, ఫ్రాన్స్ సరసన నిలిచింది.
ఐఎన్ఎస్ విక్రాంత్‌తో పాటు ఐఎన్ఎస్ విక్రమాదిత్య రూపంలో భారత్‌కు ఇప్పటికే మరో విమాన వాహక యుద్ధ నౌక అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరిన్ని విమాన వాహక యుద్ధ నౌకలు తయారుచేయాలనే యోచనలో భారత్ ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook