Intelligence Alert: భారత్‌లో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నుతున్నాయి. ఈ విషయాన్ని నిఘా విభాగాలు స్పష్టం చేశాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లే లక్ష్యంగా పాక్ ఐఎస్‌ఐ ఉగ్ర దాడులు జరిపే అవకాశం ఉందని నిఘా సంస్థలు వెల్లడించాయి. ఈక్రమంలో రైల్వే పోలీసులు అప్రమత్తమైయ్యారు. ట్రాక్‌లపై నిఘాను పెంచారు.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్థాన్‌ సరిహద్దు వెంట ఉన్న రైల్వే ట్రాక్‌లను పేల్చేందుకు కుట్రలు పన్నినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. పంజాబ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉగ్ర కుట్రలు చేసినట్లు తేల్చారు. సరకు రవాణా రైళ్లను టార్గెట్‌ చేసుకుని పేలుళ్లు జరిపేందుకు కుట్రలు చేసినట్లు స్పష్టం చేశాయి. రైల్వే ట్రాక్‌లపై దాడులు చేసేందుకు ఐఎస్‌ఐ ..తమ సానుభూతిపరులకు నిధులు సైతం సమకూర్చినట్లు విచారణలో తేలిందన్నారు.


ఈక్రమంలో భారత్‌లోని పాక్‌ స్లీపర్ సెల్స్‌కు భారీ మొత్తంలో నగదు వెళ్లినట్లు తెలిపాయి. ఇటీవల దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్రలు పన్నాయి. తెలంగాణ, హర్యానా పోలీసులు వీటిని భగ్నం చేశారు. హర్యానాలో ఓ కారులో పేలుడు పదార్థాలను సైతం స్వాధీనం చేసుకుని..ఓ  ముఠాను అరెస్ట్ చేశారు. వీరి నుంచి నగదుతోపాటు ఇతర ఆయుధానాలను సీజ్‌ చేశారు. వీరి నుంచి కీలక విషయాలను సైతం రాబట్టినట్లు తెలిపింది. పాకిస్థాన్‌ నుంచి డ్రోన్ ద్వారా ఆయుధాలు వచ్చినట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు.


నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతను రెట్టింపు చేశాయి. అనుమానితులు ఉంటే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు. అత్యంత రద్దీ ప్రాంతాల్లో భద్రతను పెంచారు. తెలుగు రాష్ట్రాల పోలీసులు సైతం అలర్ట్ అయ్యారు. ప్రధాన నగరాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఇటీవల ఆదిలాబాద్‌లో ఉగ్ర మూలాలు బయట పడటంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు.


Also read:CM Jagan Tour: వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నాం..దావోస్‌లో సీఎం వైఎస్ జగన్‌ ప్రసంగం..!


Also read:Ipl Qualifier One 2022: రేపే ఐపీఎల్‌ తొలి క్వాలిఫయర్‌, నేరుగా ఫైనల్‌ కు వెళ్లేది ఏ జట్టు..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook