న్యూఢిల్లీ: నిర్భయ ఘటనకు నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తయ్యాయి. 2012 డిసెంబర్ 16న నిర్భయపై... దేశ రాజధాని ఢిల్లీలో దుండగులు... కీచకపర్వానికి పాల్పడ్డారు. దారుణంగా హింసించి అఘాయిత్యం చేశారు. ఈ ఘటనపై  దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. నిందితులను ఉరి తీయాలనే డిమాండ్లు అప్పటి నుంచీ వినిపిస్తూనే ఉన్నాయి. ఏడేళ్లు పూర్తయినా.. ఇప్పటికీ దోషులకు శిక్షలు అమలు చేయలేదు. ఈ కేసులో ఇప్పటికే ట్రయల్స్ అన్నీ పూర్తయ్యాయి. నిందితులకు ఉరి శిక్ష విధించాలని సుప్రీం కోర్టు తీర్పు ప్రకటించింది. ఐతే శిక్ష అమలులో మాత్రం జాప్యం జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : ఏడేళ్లుగా పోరాడుతున్నాం.. ఏడు రోజులు ఆగలేమా ?


డిసెంబర్ 16నే ఉరి శిక్ష!
ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న నిర్భయ కేసు దోషులను.. డిసెంబర్ 16నే ఉరి శిక్ష అమలు చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి.  సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. బక్సర్ జైలుకు ఉరి తాళ్లు తయారు చేయాలని ఆదేశాలు ఇవ్వడం.. తీహార్ జైలులో జరిగిన పరిణామాల ఆధారంగా.. అంతా అలాగే భావించారు. కానీ నిర్భయ కేసులో దోషులు కోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. ఢిల్లీలో కాలుష్యవాతావరణం, కలుషిత నీటి కారణంగా ఆయుర్ధాయం తగ్గిపోతోందని.. ఈ నేపథ్యంలో తమకు ఇంక ఉరి శిక్ష వేయాల్సిన అవసరం ఏముందని నిర్భయ నిందితుల్లోని వినయ్ శర్మ కోర్టును ఆశ్రయించారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురువారం( డిసెంబర్ 17న) విచారణకు రానుంది. అంతకుముందే నిందితులకు డెత్ వారెంట్ అమలు చేయాలంటూ.. నిర్బయ తల్లిదండ్రులు కూడా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో రివ్యూ పిటిషన్ విచారణ తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.  


Read also : Nirbhaya case latest updates | నిర్భయ కేసు దోషులకు ఉరి ఎప్పుడు ..?


నిర్భయకు నివాళి..
నిర్భయకు జరిగిన అన్యాయాన్ని యావత్ దేశం ప్రశ్నించింది. నిర్భయకు జరిగిన అన్యాయం మరో ఆడపిల్లకు జరగొద్దంటూ గొంతెత్తి నినదించింది. నిర్భయ ఘటనకు నేటితో ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. అత్యాచార ఘటనలకు పాల్పడే వారిపై కఠినంగా శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దోషులకు ఉరి శిక్ష అమలు చేసిన రోజే.. ఆమెకు సరైన నివాళి అని చెబుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.


Read also : నిర్భయ కేసు నిందితులను ఉరితీసేందుకు తీహార్ జైలులో ఏర్పాట్లు ?


నిర్బయ దోషులను ఉరి తీస్తా...
నిర్భయ కేసులో దోషులను తాము ఉరి తీస్తామంటే.. తాము ఉరి తీస్తామంటూ దేశవ్యాప్తంగా పౌరులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే తీహార్ జైలుకు లేఖలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు తలారి బాధ్యతను తనకు అప్పగించాలని కోరుతూ... అంతర్జాతీయ షూటర్ వర్తికా సింగ్ ముందుకొచ్చారు. ఈ మేరకు ఆమె కేంద్ర హోం శాఖకు ఓ లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రక్తంతో లేఖ రాసిన ఆమె.. నిర్భయ దోషులను ఉరి తీసే తలారీ బాధ్యతను తనకు అప్పగించాలని కోరారు. తద్వారా ఒక మహిళ కూడా శిక్షించగలుగుతుందనే విషయం తెలుస్తుందని ఆమె లేఖలో పేర్కొన్నారు. మహిళా మంత్రులు, ఎంపీలు తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. 


[[{"fid":"180597","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"నిర్భయకు నివాళి","field_file_image_title_text[und][0][value]":"Condolences to Nirbhaya"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"నిర్భయకు నివాళి","field_file_image_title_text[und][0][value]":"Condolences to Nirbhaya"}},"link_text":false,"attributes":{"alt":"నిర్భయకు నివాళి","title":"Condolences to Nirbhaya","class":"media-element file-default","data-delta":"1"}}]]


విషమించిన స్వాతి మలివాల్ ఆరోగ్యం...
మరోవైపు  అత్యాచారం చేసిన  దోషులను ఆరు నెలల్లోగా ఉరి శిక్ష విధించాలనే డిమాండ్‌తో నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆదివారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలోచేర్పించారు. కానీ ఆమె వైద్యం చేయించుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఢిల్లీ రాజ్‌ఘాట్‌లోని సమతా స్థల్‌ వద్ద స్వాతి మలివాల్ పది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.