IOCL Recruitment 2023: 490 ఉద్యోగాలు..10వ తరగతి చదివితే చాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్!!
నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఐఓసీఎల్ లో 490 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హతలు, అప్లై చేయు విధానాలు..
IOCL Recruitment 2023: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL). ఈ సంస్థలో భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఐఓసీఎల్ లో 490 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో అప్రెంటీస్, అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్ వంటి పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్ లైన్‌లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి సెప్టెంబరు 10న ఆఖరు తేదీగా ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్లలో ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.
భర్తీ చేయాల్సిన ఖాళీల వివరాలు..
1. ట్రేడ్ అప్రెంటీస్ - 150
2. టెక్నీషియన్ అప్రెంటీస్ - 110
3. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ / అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ - 230
మొత్తం: 490
కావాల్సిన అర్హతలు..
ట్రేడ్ అప్రెంటీస్ - కనీసం 10వ తరగతి చదివిన వారు అర్హులు.
టెక్నీషియన్ అప్రెంటీస్ – డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ / అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ – డిగ్రీ, BBA, BA, B.Com, B.Sc..
వయస్సు..
ఐఓసీఎల్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 31, 2023 నాటికి కనిష్టంగా 18 ఏళ్లు, అలాగే గరిష్టంగా 24 ఏళ్లు మించకుండా ఉండకూడదు. అయితే ఈ దరఖాస్తుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్ లో తెలిపారు.
అప్లికేషన్ ప్రారంభ తేదీ: ఆగస్టు 25, 2023.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : సెప్టెంబరు 10, 2023.
ఆన్‌లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలంటే?
> ట్రేడ్ అప్రెంటీస్ (Trade Apprentice) – ITI http://apprenticeshipindia.org/candidate-registration
> టెక్నీషియన్ అప్రెంటీస్ (Technician Apprentice) - డిప్లొమా (Diploma) https://www.mhrdnats.gov.in/boat/commonRedirect/registermenunew!registermenunew.యాక్షన్
IOCL నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం తెలియడానికి అధికార వెబ్ సైట్.. https://www.iocl.com/apprenticeships- చెక్ చేయండి.
Also Read: Huawei Mate X5 Price: చీప్ అండ్ బెస్ట్ ఫోల్డబుల్ మొబైల్ వచ్చేసింది..ధర తెలిస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook