మీకోసం గానీ, మీ బంధువుల కోసం ఆన్​లైన్​లో రైల్వే టికెట్ బుకింగ్ చేయాలా? అయితే ఇండియన్ రైల్వే క్యాటరింగ్​ అండ్ టూరిజం కార్పొరేషన్​ (IRCTRC) తీసుకొచ్చిన కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. 
మొదటగా టికెట్ బుకింగ్​ సేవలను పొందేందుకు ఐఆర్​సీటీసీ ​సైట్​లో మీ ఈ-మెయిల్ ఐడీ(Email id), మొబైల్ నంబర్​ను (Mobile Number)​ ధృవీకరించాలని సూచించింది. ఈ ప్రక్రియ పూర్తయిన వారికే టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఆర్‌సీటీసీ (IRCTC) ద్వారా రెగ్యులర్​గా రైలు టికెట్లు బుక్ చేసేవారికి ఈ కొత్త రూల్స్​ వర్తించవు. ఎందుకంటే.. ఇప్పటికే వాళ్లు మొబైల్ నంబర్ (Mobile Number), ఈ-మెయిల్ ఐడీ (Email ID) వెరిఫై చేసి ఉంటారు. అయితే పాత మొబైల్ నంబర్​, ఈ-మెయిల్ ఐడీ స్థానంలో కొత్త వాటిని అప్​డేట్​ చేసుకునేందుకు ఐఆర్​సీటీసీ (IRCTC) వీలు కల్పిస్తోంది.


Also Read: ఒకే వ్యక్తి... 5 డోసులు.. 3 రకాల కోవిడ్-19 వ్యాక్సిన్లు.. తరువాతేం జరిగింది ??


అయితే ఐఆర్​సీటీసీ తీసుకొచ్చిన ఈ నూతన రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తి చేయడం అంత కష్టమైన పనేం కాదు. కేవలం 2 నిమిషంల్లోనే ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్​ను ధృవీకరించొచ్చు. మీ మొబైల్​ లేదా కంప్యూటర్​ ద్వారా సులభంగానే ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.


వెరిఫికేషన్​ ప్రాసెస్​ ఇలా..
1. ముందుగా ఐఆర్​సీటీసీ వెబ్​ పోర్టల్​ను (irctc.co.in) ఓపెన్ చేసి.. ఐడీ, పాస్​వర్డ్​తో లాగ్​ ఇన్​ అవ్వండి.
2. హోం పేజీలోనే మీకు వెరిఫికేషన్​ విండో కనిపిస్తుంది. దానిపై క్లిక్​ చేయండి.
3. ఇక్కడ మీ ఈ-మెయిల్​ ఐడీ, మొబైల్​ నంబర్ ఎంటర్​ చేయండి.
4. ఇప్పటికే వెరిఫై చేసి ఉంటే.. కొత్త నంబర్​, ఈ-మెయిల్ ఐడీని కానీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇందుకు ఎడమ వైపు ఉన్న ఎడిట్ ఆప్షన్​ పై క్లిక్ చేసి ఆ వివరాలను మార్చుకోవచ్చు. ఇంతకు ముందు ఈ అవకాశం ఉండేది కాదు.


Also Read: Talibans: ఇండియాతో సత్సంబంధాలే మా లక్ష్యం : తాలిబన్లు


5. ఇందులో మీ డీటెయిల్స్​ను సరిచూసుకుని నమోదు చేసి సబ్మిట్ క్లిక్ చేయండి.. అప్పుడు మీ మొబైల్​ నంబర్​కు ఓటీపీ వస్తుంది.
6. ఆ ఓటీపీని ఎంటర్​ చేయడం ద్వారా మీ మొబైల్ నంబర్ ధృవీకరకణ పూర్తవుతుంది.
7. మొబైల్ నంబర్​ను ధృవీకరించినట్లుగానే.. మెయిల్ ఐడీకి వచ్చే ఓటీపీని ఎంటర్​ చేయడం ద్వారా.. ఈ-మెయిల్​ని కూడా వెరిఫై చేయండి.


ఈ ప్రక్రియ పూర్తయితే మీరు టికెట్​ బుకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ ప్రక్రియ ఒక సారి పూర్తి చేస్తే సరిపోతుంది. టికెట్​ బుక్​ చేసుకునే ప్రతి సారి చేయాల్సిన అవసరం లేదు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G