ఐఆర్‌సీటీసీ సేవలు తాత్కాలికంగా బంద్
గురువారం రాత్రి 10:45 నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ మూతపడనుంది.
గురువారం రాత్రి 10:45 నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ మూతపడనుంది. వెబ్‌సైట్, యాప్ లను అప్ డేట్ చేసేందుకు శుక్రవారం ఉదయం 5 గంటల వరకు అన్ని సర్వీసులనూ నిలిపివేస్తున్నట్లు ఐఆర్ సీటీసీ తెలిపింది. ఆన్‌లైన్ టిక్కెటింగ్ సిస్టమ్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీ చేయడం కోసం రైల్వే కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. దీనికోసం వెబ్‌సైట్లను, యాప్స్‌ను దేశీయ రైల్వే అప్‌గ్రేడ్ చేస్తోంది. దీనిలో ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్ కూడా ఉంది. సిస్టం అప్ డేట్ చేస్తున్న సమయంలో రైల్వే స్టేషన్ లోని ఐవీఆర్ఎస్ టచ్ స్క్రీన్ లతో పాటు కాల్ సెంటర్, 139 విచారణ కూడా అందుబాటులో ఉండవని, కస్టమర్లు సహకరించాలని కోరింది.
నైట్ జర్నీ రైళ్ల సేవలు రద్దు..
ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో మీటర్‌గేజ్ రైలు మార్గాల్లో రాత్రివేళ రాకపోకలు సాగిస్తున్న పలు రైళ్లను రద్దు చేయాలని కేంద్ర రైల్వేశాఖ నిర్ణయించింది. కాపలా లేని రైల్వే లెవెల్ క్రాసింగుల వద్ద రాత్రుళ్లు ప్రమాదాలు జరగకుండా ముందుజాగ్రత్తగా ఈ చర్యలకు సిద్దమైనట్లు తెలిపారు. ఇప్పటికే రాత్రివేళ రాకపోకలు సాగిస్తున్న 73 రైళ్లను రద్దు చేశామని రైల్వే శాఖ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ఘటన నేపథ్యంలో రాత్రివేళ రైళ్లను రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాదు.. పగలు రైళ్ల వేగపరిమితిని గంటకు 75 కిలోమీటర్లకు లోపు ఉండేలా చూడాలని నిర్ణయించారు.