PM Narendra Modi: ప్రధాన మంత్రిగా గత రెండు పర్యాయాలు ఎవరి అండ లేకుండా సొంతంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీకి మూడోసారి మాత్రం అత్తెసరు సీట్లతో సరిపెట్టారు ప్రజలు. అంతేకాదు లోక్ సభలో మెజారిటీకి 40 సీట్లకు దూరంలో ఆగిపోయింది. దీంతో ప్రభుత్వ మనుగడ మిత్ర పక్షాలపై ఆధారపడింది. గత రెండు పర్యాయలు లోక్ సభ స్పీకర్ పదవి విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా సాఫీగా సాగిపోయింది. కానీ నరేంద్ర మోడీ 3వ ప్రభుత్వంలో బీజేపీ ముందున్న అతిపెద్ద సవాల్ లోక్ సభ స్పీకర్ పదవి అనే చెప్పాలి. అయితే..ఈ సారి అతి ముఖ్యమైన లోక్ సబ స్పీకర్ పదవిని ఆశించింది. ఎన్డీయే  కూటమిలోని అతిపెద్ద పార్టీ అయిన తెలుగు దేశం.. చివరకు మిత్ర పక్షాలతో చేసిన సంప్రదింపుల తర్వాత స్పీకర్ పదవి భారతీయ జనతా పార్టీ వద్దే ఉంటుందని తెలుస్తోంది.
అంతేకాదు బీజేపీ లోక్ సభ ఎంపీకే లోక్ సభ స్పీకర్ పదవి దక్కడం దాదాపు ఖాయమైంది. అంతేకాదు డిప్యూటీ స్పీకర్ పదవి.. ప్రతిపక్షానికి కాకుండా.. తమ భాగస్వామ్య పక్షాలకు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవిని ఎవరికీ ఇవ్వాలనే నిర్ణయం బీజేపికే వదిలిపెట్టాయి.   అయితే ఈ విషయంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారు. గత లోక్ సభలో కీలకమైన బిల్లుల ఆమోదంలో సభను విజయవంతంగా నిర్వహించిన ఓం బిర్లాకే మరోసారి లోక్ సభ స్పీకర్ పదవి కట్టబెడతారా.. లేకుంటే పురంధేశ్వరి లేదా కొత్త వ్యక్తి లోక్ సభ స్పీకర్ అవుతారా అనేది చూడాలి. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు హోం మంత్రి అమిత్ షా.. స్పీకర్ ను ఓం బిర్లాను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. స్పీకర్ పదవికి సంబంధించి ఈ భేటీ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.


అటు ప్రోటెం స్పీకర్ పదవి కోసం ముగ్గురు పేర్లు వినబడుతున్నాయి.  సభలో సీనియర్ సభ్యులైన రాధామోహన్ సింగ్, భర్తృహరి మహతాబ్,
ఫగ్గన్ సింగ్ కులస్తే పేర్లు వినిపిస్తున్నాయి. సీనియారిటీ ఆధారంగా వీరిలో ఎవరినైనా ప్రొటెం స్పీకర్‌గా అపాయింట్ చేసే అవకాశాలున్నాయి.  
ప్రొటెం స్పీకర్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ సభ్యులందరితో ప్రమాణం చేయిస్తారు.
స్పీకర్ ఎన్నిక పూర్తి కాగానే .. ప్రొటెం స్పీకర్.. కొత్త లోక్ సభ స్పీకర్ గా ఎన్నికైన వ్యక్తికి  ఆ సీటు కేటాయించి వెళ్లిపోతారు. జూన్ 26వ తేదిన లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్డీయే అభ్యర్థి పేరును ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించనున్నారు. సాంప్రదాయం ప్రకారం స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేలా బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజుజు కూడా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమయ్యారు.


Read more: Chandrababu naidu: ఐదేళ్లుగా శపథం.. చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింట్లో కాలు పెట్టిన మహిళ.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook