Mission Venus: చంద్రుని దక్షిణ ధృవంపై చంద్రయాన్ 3 తో విజయవంతంగా అడుగుపెట్టిన తరువాత ఇస్రో ఉత్సాహం అత్యధికమైంది. ఆ తరువాత సూర్యునిపై పరిశోధనల నిమిత్తం ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 కూడా విజయవంతమైంది. అందుకే ఇప్పుుడు ఇస్రో రెట్టించిన ఉత్సాహంతో శుక్రుడిపై ప్రయోగానికి సంసిద్ధమౌతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సౌర వ్యవస్థలో శుక్రుడి స్థానం చాలా ప్రత్యేకం. ఇది చాలా ప్రకాశవంతమైన గ్రహం. ఇక్కడి వాతావరణం కూడా భూమితో పోలిస్తే 100 రెట్లు ఎక్కువ ఆమ్లాలతో కూడి ఉంటుంది. మరింత పీడనం ఉంటుంది. ఇక్కడి వాతావరణం చాలా మందంగా ఉంటుంది. ఏదో ఒకరోజు భూమి శుక్రుడిగా మారవచ్చని, 10 వేల సంవత్సరాల తరువాత భూమి లక్షణాలే మారిపోవచ్చని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు. ఈ నేపధ్యంలో శుక్రుడిపై ప్రయోగం చాలా ఉపకరిస్తుందంటున్నారు. శుక్రుడిపై ప్రయోగం కోసం ఇప్పటికే రెండు పేలోడ్లు అభివృద్ది చేసినట్టు ఆయన చెప్పారు. 


ఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో మాట్లాడిన ఆయన వీనస్ మిషన్ గురించి వివరాలు అందించారు. త్వరలోనే భారత్ వీనస్ మిషన్ చేపట్టనున్నట్టు చెప్పారు. మరోవైపు ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించి విజయవంతం చేసిన చంద్రయాన్ 3 మిషన్‌పై ఇక ఆశలు సన్నగిల్లుతున్నాయి. చంద్రునిపై చీకటి పడటంతో నిద్రావస్థలోకి వెళ్లిన విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌లు చంద్రునిపై పగలు ప్రారంభమైనా సరే ఇంకా మేల్కొనలేదు. వాటిని యాక్టివేట్ చేసేందుకు ఇస్రో చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమౌతున్నాయి. సమయం గడిచేకొద్దీ ప్రగ్యాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ పనిచేసే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. 


Also read: AP High Court: ఉండవిల్లి పిటీషన్‌లో నాట్ బిఫోర్ మి అంశం, మరో బెంచ్‌కు బదిలీ కేసు విచారణ వాయిదా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook