ఇటీవల జనవరి 12వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన కార్టోశాట్-2 సిరీస్ శాటిలైట్ తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టింది. అందుకు సాక్ష్యం ఇదేనంటూ కార్టోశాట్-2 సిరీస్ శాటిలైట్ తన కెమెరాలతో బంధించిన తొలి చిత్రాన్ని ఇస్రో తాజాగా విడుదల చేసింది. 


Caption

మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ నగరం, నగర పరిసరాలు, నగరం నడిబొడ్డునే వున్న స్టేడియం వంటివి కార్టోశాట్-2 సిరీస్ శాటిలైట్ తీసిన ఈ చిత్రంలో చూడవచ్చు. బెంగుళూరు ఇస్రో కేంద్రం తమ అధికారిక వెబ్ సైట్ ఆధారంగా ఈ చిత్రాన్ని విడుదల చేసింది. ఈ ఉపగ్రహం ప్రయోగంతో ఇస్రో 100 ఉపగ్రహ ప్రయోగాలు పూర్తి చేసుకున్న అంతరిక్ష పరిశోధన కేంద్రంగా చరిత్ర సృష్టించింది.