Chandrayaan 3: భారతదేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించనున్న చంద్రయాన్ 3 వైపుకు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జూలై 14న చంద్రయాన్ స్పేస్‌క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నారు. చంద్రయాన్ 2 వైఫల్యమైన నేపధ్యంలో చంద్రయాన్ 3 ఇస్రోకు ఓ సవాలుగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రాజెక్టు చివరి దశలో అంటే చంద్రునిపై ల్యాండ్ అయ్యే సమయానికి విఫలమైంది. చంద్రయాన్ 2 లో ఎదురైన లోపాలు, సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఇస్రో పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. చంద్రయాన్ 2 వైఫల్యం పునరావృతం కాకుండా కొత్త టెక్నాలజీని అందుకుంది. అన్ని విధాలా సమాయత్తమైన తరువాత జూలై 14న చంద్రయాన్ 3 ప్రయోగానికి సిద్ధమైనట్టు ప్రకటించింది. చంద్రయాన్ 3 ప్రయోగంపై ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 


జూలై 14 వతేదీన ప్రయోగించనున్న స్పేస్‌క్రాఫ్ట్ ఇప్పటికే శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కు చేరుకుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను ఇస్రో...జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3తో అనుసంధానించింది. జీఎస్‌ఎల్‌వి మార్క్ 3తో ప్రయోగించనున్న స్పేస్ క్రాఫ్ట్‌కు సంబంధించిన కీలకమైన రిహార్సల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది ఇస్రో. ఇది 24 గంటల సేపు కొనసాగే రిహార్సల్, నిన్న అంటే సోమవారం మద్యాహ్నం ప్రారంభమై ఇవాళ మద్యాహ్నం ముగిసింది. రిహార్సల్ సక్సెస్ కావడంతో ఇక తుది ప్రయోగానికి సిద్ధమైనట్టు ఇస్రో ప్రకటించింది. 


43.5 మీటర్ల పొడవైన ఈ రాకెట్ మూడు రకాల ప్రొపెల్లెంట్స్ వినియోగించనుంది. ఇందులో స్ట్రాప్ ఆన్ బూస్టర్‌లో ఘన రూపంలో ఉండే ఇంధనాన్ని ఉపయోగిస్తారు. కోర్ దశలో ద్రవ ఇంధనం, చివరి దశలో క్రయోజనిక్స్ ఇంధనాన్ని వినియోగించారు. 204.5 టన్నుల ఘన ఇంధన శక్తి స్ట్రాప్ ఆన్ బూస్టర్లకు లభించింది. ఇక కోర్ స్టేజ్, అప్పర్ స్టేజ్‌లలో ఒక్కొక్క ప్రొపెల్లెంట్ 115.8 టన్నులు, 28.6 టన్నులు కలిగి ఉంటుంది. చంద్రయాన్ 3 బరువు 3,900 కిలోలుంటుంది. మొత్తం రాకెట్ బరువు 642 టన్నులు. అత్యంత కీలకమైన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ త్వరలో ప్రారంభం కానుంది. 


జూలై 14వ తేదీ మద్యాహ్నం 2.15 గంటలకు చంద్రయాన్ 3 ప్రయోగించనున్నారు. స్పేస్ క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి మోసుకెళ్లే రాకెట్ 40 రోజులు ప్రయాణించనుంది. అంటే ఆగస్టు 23 లేదా 24వతేదీ నాటికి చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్ 3 ల్యాండ్ కానుంది. చంద్రయాన్ 3 ప్రయోగం నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. శ్రీహరికోటలో రోడ్లు వేయడం, గుంతలు తవ్వడం నిషేధించింది. ఎందుకంటే శ్రీహరికోట సతీష్ ధావన్ సెంటర్‌కు వెళ్లే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ దెబ్బతినకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టింది. షార్ సెంటర్‌కు అనుసంధానించే అన్ని ఫైబర్ ఆప్టికల్ కేబుళ్లను కేంద్ర టెలీకం మంత్రిత్వ శాఖ నేరుగా పర్యవేక్షిస్తుంది. 


Also read: Heavy Rains: ఉత్తరాదిన ఊహకందని జల విలయం.. ఇబ్బందుల్లో జనం.. 37కి చేరిన మృతులు..



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook