Mission Gaganyaan: అతి తక్కువ ఖర్చులో చంద్రయాన్ విజయవంతం కావడంతో ఇస్రో ఖ్యాతి ప్రపంచానికి అర్ధమైంది. ఆదిత్య ఎల్ 1 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో సామర్ధ్యం తెలిసింది. ఇప్పుడు గగన్‌యాన్ పేరుతో అంతరిక్షంలో అడుగెడుతోంది. ఈ ఏడాది చివర్లో షెడ్యూల్ కానున్న ఈ ప్రాజెక్టుకు నలుగురు వ్యోమగాములు సిద్ధమయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇస్రో అత్యంత ఘనంగా చేపట్టిన గగన్‌యాన్ యాత్ర ఈ ఏడాది చివర్లో షెడ్యూల్ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు చాలావరకూ పూర్తయ్యాయి. అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైన నలుగురు వ్యోమగాములకు శిక్షణ కూడా పూర్తయింది. భారత తొలిసారిగా నలుగురు వ్యోమగాముల్ని అంతరిక్షంలో పంపించనుంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఇస్రో కీర్తి మరింత పెరగనుంది. అయితే అంతరిక్షంలో వెళ్తున్న ఆ నలుగురు వ్యోమగాములు ఎవరనే విషయంపై సస్పెన్స్ కొనసాగింది. ఇవాళ ఆ నలుగురిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అందరికీ పరిచయం చేయనున్నారు. 


ఇవాళ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వేదికగా ప్రదాని మోదీ అంతరిక్షంలో వెళ్లే నలుగురు వ్యోమగాముల వివరాలు ప్రకటించనున్నారు. ఆ నలుగురు మరెవరో కాదు. వైమానిక దళానికి చెందిన పైలట్లు ప్రశాంత్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణ, చౌహాన్‌లు. ప్రస్తుతం ఈ నలుగురికీ బెంగళూరులోని ఇస్రో సెంటర్‌లో ప్రత్యేక శిక్షణ అందుతోంది. 


Also read: RPF Jobs: టెన్త్‌, డిగ్రీ చదివితే చాలు.. రైల్వేలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగం ఇట్టే కొట్టేయొచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook