IT Raids Raids at BBC Office In Delhi: ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాలపై మంగళవారం ఉదయం ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఉద్యోగుల ఫోన్లు అన్ని స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారుల బృందం.. రెండు కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు  తెలుస్తోంది. 60 నుంచి 70 మంది ఐటీ సిబ్బందితో కూడిన బృందం ఈ సోదాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. దీంతో పాటు ఆయా కార్యాలయాలలోకి ఎవరినీ రాకుండా.. బయటకు వెళ్లకుండా నిలిపివేసినట్లు తెలిసింది. అయితే ఐటీ దాడులపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దేశవ్యాప్తంగా 20 కార్యాలయాల్లో దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2002 గుజరాత్ అల్లర్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రిలీజ్ చేసిన డాక్యూమెంటరీపై సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ డాక్యూమెంటరీని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయగా.. అనేక విశ్వవిద్యాయాల్లో ప్రదర్శించారు. దీనిపై ఢిల్లీలోని జేఎన్‌యూలో పెద్ద దుమారమే రేగింది. బీబీసీని బ్యాన్ చేయాలని ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు కొట్టేసింది. బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహించడంపై కాంగ్రెస్ స్పందించింది. ఈ దాడిని అప్రకటిత ఎమర్జెన్సీగా అభివర్ణించింది. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడింది. 
 



ఐటీ దాడులపై బీజేపీ కూడా స్పందించింది. కాంగ్రెస్ ఆరోపణలను తప్పుబట్టింది. దేశంలో ఏజెన్సీలు తమ పని తాము చేసుకుపోతున్నాయని పేర్కొంది. ఆదాయపు పన్ను శాఖ బీబీసీ కార్యాలయాలపై దాడులు నిర్వహించడాన్ని డాక్యుమెంటరీతో లింక్ చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను అవలంభిస్తోందని మండిపడింది. 


Also Read: TDP Vs Janasena: ఆ నియోజకవర్గంలో టీడీపీకి జనసేన చెక్.. ప్లాన్ రివర్స్..?  


Also Read: Marburg Virus: కలకలం రేపుతున్న కొత్త వైరస్.. వ్యాధి లక్షణాలు ఇవే..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook