ఐటీ రిటర్న్స్‌పై ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించిన కేంద్రం
ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును జూలై 31 నుంచి ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్) గురువారం ప్రకటించింది. 2018-19 సంవత్సరానికిగాను ఆడిట్ అవసరంలేని పన్ను చెల్లింపుదారులు ఆగస్టు 31వ తేదీ వరకు ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసుకోవచ్చని ఆదాయ పన్ను శాఖ స్పష్టంచేసింది. ఇదివరకు ఈ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే గడువు జూలై 31 వరకు మాత్రమే ఉండటంతో సమయాభావం వల్ల ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వీలు కాని ఉద్యోగులకు ఈ వార్త ఊరటనిచ్చింది.