ITBP Constable Recruitment 2021 online application process: న్యూ ఢిల్లీ: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఐటిబిపి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం రిజిస్ట్రేషన్ జూలై 5, 2021 నుండి ప్రారంభమైంది. ఐటిబిపి కానిస్టేబుల్ పరీక్షలకు (ITBP exams 2021) హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఐటిబిపి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాలని సూచించారు. ఐటిబిపి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2021 (ITBP Constable Recruitment 2021) కోసం నమోదు చేయడానికి, దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఈ కింది డీటేల్స్ ఉపయోగపడతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐటిబిపి కానిస్టేబుల్ జిడి రిక్రూట్మెంట్ 2021 (ITBP Constable GD Recruitment 2021) కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు.


Also read : SBI Home Loan Interest: ఎస్‌బీఐ హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ కావాలా, గుడ్ న్యూస్


How to apply for ITBP Constable Recruitment 2021 ? ఐటిబిపి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2021 కు ఎలా దరఖాస్తు చేయాలి ?
ఐటిబిపి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2021 కోసం దరఖాస్తు చేయడానికి అనుసరించే విధానం.


1) ఐటిబిపి రిక్రూట్మెంట్ అధికారిక వెబ్‌సైట్‌కు (recruitment.itbpolice.nic.in) లాగాన్ అవండి. 
2) వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ప్రముఖంగా కనిపిస్తున్న రిక్రూట్‌మెంట్ లింకుపై క్లిక్ చేయండి.
3) ఇది రిజిస్ట్రేషన్ పేజీకి డైవర్ట్ అవుతుంది.
4) రిజిస్ట్రేషన్ పేజీలో అడిగిన వివరాలు నమోదు చేసి ఆ తరువాత ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను (ITBP online application form) పూరించండి.
5) దరఖాస్తు ఫామ్‌ను సబ్మిట్ చేసి సేవ్ చేయండి.


Also read: IPL 2021 Latet News: ఐపీఎల్ కోసం భారీ వ్యూహాలు రచిస్తోన్న BCCI, కీలక నిర్ణయాలు


ఐటిబిపి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2021 (Govt jobs) కోసం పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం సమర్పించడానికి సెప్టెంబర్ 2, 2021 వరకు గడువు ఉంది. దరఖాస్తు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


Also read : India Corona Positive Cases: ఇండియాలో భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు, COVID-19 మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook