'కరోనా వైరస్' దేశ ప్రజలను అన్ని రకాలుగా  విచ్ఛిన్నం చేసిందని కాంగ్రెస్ ఎంపీ, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు భారతీయులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చైనా నుంచి వచ్చిన వైరస్ దెబ్బకు భారత సామాన్య పౌరులే ఎక్కువగా ఇబ్బంది పడ్డారని రాహుల్ గాంధీ అన్నారు. స్పీకప్ ఇండియా పేరుతో ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఆయన. . భారతీయ పౌరులంతా ఏకం కావాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా నాలుగు డిమాండ్లు చేశారు.  ప్రతి పేద, వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. వారి  బ్యాంకు ఖాతాల్లో నెలకు  7 వేల 500  రూపాయల చొప్పున ఆరు నెలల వరకు ఇవ్వాలని కోరారు.  అంతే  కాదు  జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 100  రోజులు కాకుండా 200 రోజులు కల్పించాలని కోరారు. సూక్ష్మ, మధ్యతరహా పారిశ్రామికవేత్తలను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని అందించాలన్నారు. వలస కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు.



 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..