ఈ రోజు జరిగిన "ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు"లో అమెరికా సలహాదారు మరియు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ కీలక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలోని ముఖ్య విషయాలు


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    70వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నందుకు భారతీయ పౌరులకు శుభాకాంక్షలు. భారతీయ డాక్టర్లు, ఇంజినీర్లు ఎంతో సాధించారు. భారతీయ శాస్త్రవేత్తలు చంద్రుడి మీదకు వెళ్లి తామేంటో నిరూపించారు. శాస్త్రపురోగతిలో రాణించారు.


  • మార్పు అంటే ఏమిటో మోడీ నిరూపించారు.  ఆయనో గొప్ప నాయకుడు.


  • టీహబ్ ఆసియాలోనే అతిపెద్ద ఇన్ క్యుబేటరుగా ఘనతకెక్కుతుంది. యువ వ్యాపారవేత్తలు కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్నారు. అహర్నిశలు శ్రమిస్తున్నారు. రాత్రిళ్లు, పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. మీరు మీ భవిష్యత్తును నిర్మించుకొనే దిశగా ప్రయాణిస్తున్నారు. 


  • 1500 వ్యాపారవేత్తల్లో మహిళల శాతం ఎక్కువగా ఉండడం ఆనందదాయకం. పురుషాధిక్య సమాజంలో తమవంతు పాత్ర పోషించాలంటే మహిళలు మరింత రాణించాలని తెలుసుకున్నా. ఏ దేశ ఆర్థిక బలమైనా పుంజుకోవాలంటే.. మహిళా వికాసం అత్యంత ముఖ్యం. అమెరికా దాదాపు 500 మిలియన్ డాలర్లు ప్రతీ యేటా మహిళా వికాసానికి ఖర్చుపెడుతోంది. 


  • ఒక యువతి లేక యువకుడు పారిశ్రామికవేత్తగా రాణించాలంటే.. వారికి ప్రొఫెషనల్ గైడెన్స్ అవసరం. జీఈ సదస్సులో 52 శాతానికి పైగా మహిళలు పాల్గొనడం విశేషం


  • ప్రపంచవ్యాప్తంగా కోటి 10 లక్షలమంది మహిళా శాస్త్రవేత్తలు ఉన్నారు. 


  • హైదరాబాద్‌ని ముత్యాల నగరంగా కూడా భావిస్తారని విన్నాను. ఆ రంగంలో కూడా మహిళలు తమదైన పాత్ర పోషించడం విశేషం.  నేడు గ్రామీణ మహిళలు కూడా భారతదేశంలో  వ్యాపారవేత్తలుగా రాణించడం ఎంతో గొప్ప విషయం. భారతదేశంలో వికాసం మహిళలు లేకుండా సాధ్యమని మోడీ నమ్మినందుకు ఆయనకు నా అభినందనలు.