పవిత్ర రంజాన్ మాసంలో కాల్పులు జరుపుకోవద్దని నీతులు చెప్పిన పాకిస్థాన్ ఆర్మీ.. తమ మాటలకే తూట్లు పొడుస్తూ భారత్‌పై తూటాల వర్షం కురిపిస్తోంది. జమ్ములోని కథువా, సాంబా సెక్టార్లపై ఈ ఉదయం నుంచి రాకెట్ షెల్స్, తుపాకులతో విరుచుకుపడుతున్న పాక్ నలుగురు కాశ్మీర్ పౌరులను పొట్టనబెట్టుకుంది. కాల్పుల్లో మరో 30 మంది గాయపడ్డారు. భారత సైనిక శిబిరాలు, జనావాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ దళాలు కాల్పులు జరుపుతున్నాయి. పాక్ రేంజర్లు మోర్టార్లతో దాడి చేయడం వల్ల పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. కార్ల అద్దాలు పగిలిపోయాయి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


సరిహద్దు గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 5 కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న స్కూళ్లను తాత్కాలికంగా మూసివేశారు. వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బస కల్పిస్తున్నారు. వారం రోజుల నుంచి పాకిస్థాన్ దళాలు కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. వరుసగా కాల్పులు జరపడం ఇది 9వ రోజు కాగా.. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. పాక్‌కు భారత ఆర్మీ గట్టి బదులిస్తోంది.


ఇదిలా ఉండగా అనంతనాగ్ బిజ్‌బేహరాలో గ్రేనేడ్ దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.